మంచి నాయకురాలవుతారా?

నాయకత్వ హోదాలో ఉండే మహిళల శాతమే తక్కువ. ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నా.. ఎన్నో సవాళ్లు. ఏం చేసినా ఫిర్యాదులొస్తోంటే.. అమ్మాయిని కాబట్టే ఇలా అని ఊరుకోకండి. ఈ అంశాలనూ చెక్‌ చేసుకోండి.

Published : 10 Jun 2022 00:34 IST

నాయకత్వ హోదాలో ఉండే మహిళల శాతమే తక్కువ. ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నా.. ఎన్నో సవాళ్లు. ఏం చేసినా ఫిర్యాదులొస్తోంటే.. అమ్మాయిని కాబట్టే ఇలా అని ఊరుకోకండి. ఈ అంశాలనూ చెక్‌ చేసుకోండి.

* ఒక స్థాయికొచ్చాక నిరూపించుకోవాలన్న ఆరాటం సహజమే. అయితే దానిలో పడి మీ కింది వాళ్ల గురించి పట్టించుకోవడం వదిలేస్తున్నారేమో చూసుకోండి. ఏదైనా విజయం సాధిస్తే మీదే అన్నట్టుగా ఉండొద్దు. అందరిదీ అన్న భావన కలిగించండి. తప్పు విషయంలో బాధ్యత వహించండి. ముందుండి నడపాల్సిన వారి లక్షణమది.

* కొత్తగా బృందంలోకి చేరిన వారికి ఉత్సాహం, బిడియం రెండూ ఉంటాయి. వాళ్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. నిజమే! అలాగని ఏదైనా సలహానివ్వబోతే ‘నీకు తెలియదు, నువ్వు కొత్త’ లాంటివి చెప్పకండి. నెగెటివిటీ ఏర్పడుతుంది. ముందు వినండి. తర్వాత సాధ్యాసాధ్యాలను చర్చిస్తే.. విషయం వాళ్లకే అర్థమవుతుంది.

* లీడర్‌ స్థాయిలో ఉన్నంత మాత్రాన పని చేయకూడదన్న నిబంధనేమీ లేదు కదా! వారితో కలిసి మీరూ పనిచేయండి. ఏం చేద్దాం? ఈ సమయంలోగా పూర్తవ్వాలంటే మనమేం చేయాలి.. అంటూ కలిసిపోండి. చుట్టూ ఉన్నవారిలో మన అన్న భావనని నింపగలుగుతారు.

* పైవాళ్లు ఏదైనా అంటే మిన్నకుండిపోతారు చాలామంది. అదే కిందివాళ్లు చిన్న తప్పు ఎత్తిచూపినా తట్టుకోలేరు. మీదీ అదే కోవా? అయితే మీరు సరైన నాయకురాలు కాదన్నట్లే. వాళ్లు చెప్పినదానిలో నిజం ఎంతవరకూ ఉందో మిగతా వారితో మాట్లాడి రూఢీ చేసుకోండి. తప్పుగా అర్థం చేసుకున్నారనిపిస్తే వివరించే ప్రయత్నం చేయండి. నిజమే అయితే మిమ్మల్ని మీరు మార్చుకోండి. అంతేకానీ వారిని వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేయకండి.

* ఆ స్థాయికి చేరడానికి ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఉంటారు కదా! బోలెడు అనుభవం సంపాదించి ఉంటారు. అది కింది వాళ్లకీ పంచండి. మీ తర్వాత కాకుండా మీతో పోటీపడగల నాయకుల్ని తయారు చేయండి. మెంటార్‌గా వ్యవహరిస్తూ వారికి సాయం చేయండి. అసలైన నాయకురాలంటే అర్థమదే.. ఇతరుల్నీ నాయకుల్లా తయారు చేయడం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్