Updated : 12/06/2022 00:25 IST

ఇష్టమైన రంగాన్నే ఎంచుకోండి..

గెలుపు మంత్రం

‘మీకు పెద్దగా ఆసక్తి లేని లేదా లక్ష్యాలు నిర్దేశించుకోలేని రంగంలో చేరి సమయాన్ని, శక్తిని వృథా చేసుకోవద్దు. ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని దాని గురించి సంపూర్ణంగా తెలుసుకుని లక్ష్యం దిశగా పనిచేయండి. స్థాయి, హోదాలతో నిమిత్తం లేకుండా అందరి అభిప్రాయాలూ సేకరించాలి. దీనివల్ల మన లోపాలను గుర్తించి, సరి చేసుకోగలుగుతాం. ఇది నేను నమ్మే సిద్ధాంతం. మనమంతా ఒకే రకమైన తుపాను వాతావరణంలో ప్రయాణిస్తుంటాం, కాకపోతే అందరం ఒకే పడవలో కాదు’.

- లీనా నాయర్‌

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో పుట్టి పెరిగిన లీనా నాయర్‌ మానవ వనరుల విభాగంలో ఉన్నతాధికారిగా యూనిలీవర్‌ సంస్థలో చేరి అక్కడే తొలి మహిళా సీఈఓగా ఎదిగారు... ఇదో రికార్డు. ఈ పదవి చేపట్టిన తొలి ఆసియావాసి, అత్యంత పిన్న వయస్కురాలు కూడా ఆమే. 190 దేశాలకు విస్తరించిన ఆ సంస్థలో ఉద్యోగుల స్థితిగతులను తెలుసుకోవడం మొదలు అనేక బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి తన సత్తా చాటుకున్నారు. తర్వాత లీనా ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ సంస్థ ‘ఛానెల్‌’ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన 112 ఏళ్ల నాటి అతి పెద్ద రెడీమేడ్‌ దుస్తుల ఫ్యాషన్‌ హౌజ్‌ ఇది. వైవిధ్యానికి, శ్రమకు పెద్దపీట వేసే లీనా అవకాశం దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. ఖాళీ సమయంలో పుస్తకపఠనం, పరుగు, నృత్యం - ఆమె సరదాలు. ‘గ్లోబల్‌ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, ‘ది గ్రేట్‌ బ్రిటిష్‌ బిజినెస్‌ విమెన్స్‌ అవార్డు’ లాంటి పురస్కారాలు లీనా ప్రతిభకు మచ్చుతునకలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని