కరివేపాకుతో కలిపి రాస్తే..

కొబ్బరినూనెలో కరివేపాకు కలిపి తలకు పెట్టడం అనాదిగా మనకు అలవాటే. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు కురులను బలంగా, ఒత్తుగా చేస్తాయి. దీనికితోడు ఇంకొన్నింటిని చేరిస్తే అదనపు ప్రయోజనం చేకూరుతుందంటున్నారు నిపుణులు. అవేంటంటే..

Updated : 15 Jun 2022 04:10 IST

కొబ్బరినూనెలో కరివేపాకు కలిపి తలకు పెట్టడం అనాదిగా మనకు అలవాటే. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు కురులను బలంగా, ఒత్తుగా చేస్తాయి. దీనికితోడు ఇంకొన్నింటిని చేరిస్తే అదనపు ప్రయోజనం చేకూరుతుందంటున్నారు నిపుణులు. అవేంటంటే..

* ఉల్లి.. ఒక ఉల్లిపాయ నుంచి రసం తీసి పక్కనపెట్టాలి. గుప్పెడు కరివేపాకును మెత్తగా రుబ్బి ఆ మిశ్రమానికి ఉల్లిరసం కలిపి, మాడుకు పట్టించండి. గంట తర్వాత షాంపూ చేస్తే సరి. తల నెరవడం, వెంట్రుకలు రాలడం వంటివి తగ్గుతాయి.

* మెంతాకు, ఉసిరి.. మెంతాకులు, కరివేపాకు కప్పు చొప్పున తీసుకుని మెత్తగా రుబ్బాలి. దానికి రెండు స్పూన్ల ఉసిరి పొడి కలిపి మాడుకు రాసి, అరగంటపాటు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. జుట్టు పెరుగుదలకే కాదు.. కుదుళ్ల నుంచి దృఢంగా తయారవడానికి సాయపడుతుంది.

* పెరుగుతో.. కప్పు కరివేపాకును మిక్సీ పట్టి, తగినంత పెరుగు కలిపాలి. దీన్ని తల, కురులకు పట్టించండి. 30-40 నిమిషాల తర్వాత కడిగేయండి. కురులు ఆరోగ్యంగా తయారవడంతోపాటు చుండ్రూ అదుపులోకి వస్తుంది. ఇంకా కురులూ పట్టుకుచ్చులా తయారై మెరుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్