పెదనాన్న ఆస్తి నేను రాయించుకోవచ్చా?

నా వయసు 24. మా పెద్దనాన్నగారికి భార్యా, పిల్లలు లేరు. తనకున్న ఇంటి స్థలాన్ని నా పేర రాస్తానంటున్నారు. ఇది వీలునామా ద్వారా రాయించుకోవాలా? రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలా? లేదంటే నన్ను ఆయన దత్తత తీసుకోవాలా? భవిష్యత్తులో ఎలాంటి చిక్కులూ లేకుండా మంచి మార్గాన్ని సూచించగలరు....

Updated : 05 Jul 2022 12:20 IST

నా వయసు 24. మా పెద్దనాన్నగారికి భార్యా, పిల్లలు లేరు. తనకున్న ఇంటి స్థలాన్ని నా పేర రాస్తానంటున్నారు. ఇది వీలునామా ద్వారా రాయించుకోవాలా? రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలా? లేదంటే నన్ను ఆయన దత్తత తీసుకోవాలా? భవిష్యత్తులో ఎలాంటి చిక్కులూ లేకుండా మంచి మార్గాన్ని సూచించగలరు.

- ఓ సోదరి, ఆదిలాబాద్‌

మీ పెదనాన్నకి భార్యాపిల్లలు లేరంటే పెళ్లి కాలేదని అనుకోవాలా? పెళ్లి అయ్యాక భార్యాపిల్లలు వదిలేసి వెళ్లారా? లేదంటే విడాకులు తీసుకున్నారా? మీ వయసును బట్టి మీరు దత్తత తీసుకోవడానికి అర్హులు కారు. సెక్షన్‌ 10, హిందూ అడాప్షన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌ 1956 ప్రకారం 15 ఏళ్లు దాటిన వాళ్లు, పెళ్లైన వాళ్లు దత్తత తీసుకోవడానికి అర్హులు కాదు. సెక్షన్‌ 11 ప్రకారం పెళ్లై పిల్లలు ఉన్నవాళ్లు దత్తత చేసుకోవడానికి అర్హులు కారు. కొడుకు, మనవడుగానీ ఉంటే కొడుకుని దత్తత తీసుకోకూడదు. కూతురు ఉంటే లేదా కొడుకు కూతురు ఉంటే కూతురిని దత్తత తీసుకోకూడదు. మీ పెదనాన్న గారికి పెళ్లై, విడాకులూ అయ్యుంటే, పిల్లలు లేకుంటే చెల్లుతుంది. కానీ మీ వయసు 24 కాబట్టి మిమ్మల్ని తీసుకోవడం చెల్లదు. మీ పెదనాన్నగారి పేరు మీద ఉన్న స్థలం స్వార్జితమా? పిత్రార్జితమా? స్వార్జితం అయితే విల్‌ ద్వారాగానీ గిఫ్ట్‌ద్వారా గానీ మీ పేరు మీద రిజిస్టర్‌ చేయించుకుంటే సరిపోతుంది. పిత్రార్జితం అయితే దానికి మళ్లీ హిందూ వారసత్వ చట్టంలో చెప్పిన ప్రకారం వారసులు ఉంటారు. క్లాస్‌-1 వారసులు, క్లాస్‌-2 వారసులు ఒకరి తర్వాత ఒకరు వస్తారు. కాబట్టి పిత్రార్జితం అయితే విల్‌, గిఫ్ట్‌ రాయించడానికి లేదు. కాబట్టి మీరు కొనుక్కున్నట్లుగా సేల్‌ డీడ్‌ చేయించుకోండి. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పడతాయి. కానీ భవిష్యత్తులో ఏ సమస్యా రాకుండా ఉంటుంది. ఎక్కడా పొరపాట్లు జరగకూడదనుకుంటే లాయర్‌ని కలిసి వారి సలహాతో వెళ్లడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్