సమయం మీ చేతిలోనే..
రాణి ఉదయం లేచినప్పటి నుంచి ఎంత పరుగులు పెట్టినా పని ఆలస్యమవుతుంది. విధుల్లోనూ క్షణం కూడా వృథా చేయకపోయినా సమయానికి బాధ్యతలను పూర్తి చేయలేదు. దీనికి
రాణి ఉదయం లేచినప్పటి నుంచి ఎంత పరుగులు పెట్టినా పని ఆలస్యమవుతుంది. విధుల్లోనూ క్షణం కూడా వృథా చేయకపోయినా సమయానికి బాధ్యతలను పూర్తి చేయలేదు. దీనికి పరిష్కారం సరైన స్వీయ నిర్వహణే అంటున్నారు నిపుణులు.
సమయపాలన కొరవడితే ఇంటిపనులు, వ్యక్తిగతమైనవి కూడా వెనకబడతాయి. ముందుగా పని ఆధారంగా దానికెంత సమయం పడుతుందో అంచనా వేయగలగాలి. ఆఫీస్‌కు తొమ్మిది గంటలకు బయలుదేరాలంటే ఎన్ని గంటలకు మీరు నిద్రలేవాలి అనేది ప్రణాళిక వేసుకోవాలి. దానికి తగినట్లుగా అడుగులేయాలి. నాలుగైదు పనులను ఒకేసారి కాకుండా చిన్నచిన్న లక్ష్యాలుగా చేసుకొని విడివిడిగా పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. లేదంటే అంతా అవకతవకలుగా మారుతుంది. స్వీయ నిర్వహణను పాటిస్తూ, సమయాన్ని వృథా చేయకుండా ఉంటే చాలు. అనుకున్నట్లుగా బాధ్యతలన్నీ పూర్తిచేయొచ్చు.
సమస్య..
ఎంత వేగంగా పనిచేస్తున్నా.. ప్రయోజనం లేదనిపించినప్పుడు సమస్య ఎక్కడ ఉందో గుర్తించాలి. ఎక్కడ మీ వేగం తగ్గుతుందో లేదా ఏ పని సమయాన్ని వృథా చేస్తుందో తెలుసుకోవాలి. ఆ పనిని అవసరం లేకపోతే సాయంత్రానికి బదిలీ చేసుకోవాలి. ప్రతి నిమిషమూ విలువైనదే అని తెలుసుకుంటే దాన్ని ఎలా వినియోగించాలో అర్థమవుతుంది. మొత్తం బాధ్యతలన్నీ మీరే పూర్తిచేయకుండా ఇంట్లో మరొకరికి కూడా కొన్నింటిని పంచితే ఆ సమయం మీకు మరొక పనికి ఉపయోగపడి పని సులువు అవుతుంది.
ఉద్యోగ బాధ్యతల్లో..
ఇంట్లో మిగిలిన పనిని తర్వాత చేయొచ్చు. మరొకరికి అందించొచ్చు. ఆఫీస్‌లో ఇలా బదిలీ చేయడం వీలుకాదు. ఇటువంటి చోట్ల స్వీయ నిర్వహణ పాటించాలి. ఇందుకోసం మీ నైపుణ్యాలను పెంచుకోవాలి. అలాగే చేసే పనిలో నాణ్యత లోపించకూడదంటే ఒత్తిడి, ఆందోళనవంటివి దరికి చేరనివ్వకూడదు. వీటి కారణంగా పనిలో వేగం తగ్గడమే కాదు, నాణ్యత లోపిస్తుంది. సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించడంపై సాధన చేయాలి. అయితే దీనికి ఆరోగ్యం కూడా సహకరించాలి. నిండైన ఆరోగ్యం తోడైతేనే బాధ్యతలన్నింటినీ సక్రమంగా పూర్తిచేయొచ్చు. అదీ...అనుకున్న సమయంలోపే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.