అశ్వగంధతో... ఆరోగ్యం
ఇల్లు, ఆఫీస్ అంటూ పని ఒత్తిడితో ఆందోళనకు గురయ్యే అతివలకు అశ్వగంధ టీ అలసట తీర్చడమే కాదు.. సంపూర్ణ ఆరోగ్యాన్నీ ఇస్తుందంటున్నారు నిపుణులు. అలాగే సౌందర్యాన్నీ పరిరక్షిస్తుందని చెబుతున్నారు.
ఇల్లు, ఆఫీస్ అంటూ పని ఒత్తిడితో ఆందోళనకు గురయ్యే అతివలకు అశ్వగంధ టీ అలసట తీర్చడమే కాదు.. సంపూర్ణ ఆరోగ్యాన్నీ ఇస్తుందంటున్నారు నిపుణులు. అలాగే సౌందర్యాన్నీ పరిరక్షిస్తుందని చెబుతున్నారు.
పలు రకాల ఔషధగుణాలున్న అశ్వగంధతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలెన్నో ఉన్నాయి. కప్పు నీళ్లలో పావుచెంచా అశ్వగంధ పొడి వేసి మరిగించి వడకట్టాలి. ఇందులో అరచెక్క నిమ్మ రసం, చెంచా తేనె కలిపి టీ తయారుచేసి నిద్రపోయే ముందు తాగితే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివాటికి దూరంగా ఉండొచ్చు. కంటినిండా నిద్రపోవచ్చు. మానసిక ప్రశాంతత పొందడంతో రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. అంతేకాదు, ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడంతో అధికబరువు సమస్య నుంచి బయటపడొచ్చు. రక్తపోటును అదుపుచేసి, కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంతో మెనోపాజ్ తర్వాత ఎదురయ్యే హృద్రోగ సమస్యకు దూరంగా ఉండొచ్చు.
మెనోపాజ్‌లో
అశ్వగంధ టీ మెనోపాజ్ సమయంలో మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. 45-50 ఏళ్ల మధ్య నిద్రలేమి సమస్య మొదలైనవారు ఈ టీని ప్రతిరోజు తీసుకుంటే బయటపడొచ్చు. తరచూ మతిమరపు అనిపించినప్పుడు కాఫీ, టీలు తగ్గించి ఈ టీ కి ప్రాముఖ్యతనిస్తే చాలు. ఇది మెదడులో అసిటిల్కోలిన్ స్థాయులను పెంచి, జ్ఞాపకశక్తిని మెరుగుపడేలా చేస్తుంది. కొంచెం సేపు పనిచేసినా అలసిపోతోంటే కప్పు అశ్వగంధ టీ తాగి చూడండి. ఇది నరాలను శక్తివంతమయ్యేలా మారుస్తుంది. దీంతో తిరిగి ఉత్సాహం దరిచేరుతుంది. ఇది ఫ్రీరాడికల్స్‌తో పోరాడి శరీరాన్ని బలోపేతం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సీజనల్ అనారోగ్యాలకు తరచూ గురికాకుండా కాపాడుతుంది.
అందంలోనూ..
ఒత్తిడిలో కార్టిసోల్ హార్మోన్ విడుదలై, చర్మం ప్రభావితమై, మొటిమలు, మచ్చలు వంటి వాటికి కారణమవుతుంది. ఆ హార్మోన్ ప్రభావాన్ని చర్మంపై పడకుండా ఈ టీ కాపాడుతుంది. ఇది వృద్ధాప్య ఛాయలను అడ్డుకోవడంలో కూడా ఉపయోగపడుతుంది. అశ్వగంధలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు రాకుండా చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఒత్తిడికి గురి కాకుండా చేసి మృదువుగా మారుస్తాయి. కంటికింద నల్లని వలయాలు, ముడతలను దూరం చేస్తుంది. మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి, పిగ్మంటేషన్ సమస్యనూ రానివ్వదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!