మొదలైంది మన హవా!

మేనేజ్‌మెంట్‌ విద్యలో లింగ సమానత్వం కోసం అంతర్జాతీయ విద్యాసంస్థలూ ప్రయత్నిస్తున్నాయి. మగవారి ఆధిక్యతే కనిపిస్తున్న ఈ తరగతి గదుల్లోకి అమ్మాయిల్నీ తీసుకురావడానికి చర్యలూ తీసుకుంటున్నాయి.

Published : 25 Jul 2022 00:34 IST

మేనేజ్‌మెంట్‌ విద్యలో లింగ సమానత్వం కోసం అంతర్జాతీయ విద్యాసంస్థలూ ప్రయత్నిస్తున్నాయి. మగవారి ఆధిక్యతే కనిపిస్తున్న ఈ తరగతి గదుల్లోకి అమ్మాయిల్నీ తీసుకురావడానికి చర్యలూ తీసుకుంటున్నాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) రాయ్‌పూర్‌ మరో అడుగు ముందుకేసి అమ్మాయిల్నే ఎక్కువ చేర్చుకొని ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సంస్థలో ఈ ఏడాది అమ్మాయిల సంఖ్య 205గా ఉంటే అబ్బాయిలు 125 మంది. అంటే.. 20 శాతానికిపైనే! గత ఏడాది అబ్బాయిలు 146 ఉంటే, అమ్మాయిలు 120 మంది. దీనికోసం ఎంపిక ప్రక్రియ, ఇంటర్వ్యూల్లో మార్పులేమీ చేయలేదట. అయినా ఎలా సాధ్యమైందంటే.. ఆ విద్యాసంస్థ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్‌పర్సన్‌ మహిళ. లింగ సమానత్వం, అమ్మాయిలకు సురక్షిత వాతావవరణ వంటి వాటిపై దృష్టిపెట్టారట. దీంతో ఉత్తమ విద్యా సంస్థల్లో సీట్లను వదులుకొని మరీ చాలా మంది ఇక్కడ చేరారట. ఐఐఎం కోజికోడ్‌ కూడా ఇదే బాటలో నడుస్తోంది. లింగ సమానత్వం కోసమని 2019లో ఎంబీఏ కోర్సుల్లో సూపర్‌ న్యూమరరీ సీట్లను ప్రవేశ పెట్టింది. అంటే ఆ సీట్లు అమ్మాయిలకు ప్రత్యేకమన్న మాట. అది పని చేయడంతో ఈ ఏడాది వారి సంఖ్య 46.7 శాతానికి చేరింది. ‘సంఖ్యను పెంచడంపై కాకుండా వారిపై అభిప్రాయాలను మార్చడంపై దృష్టిపెట్టాం. ఎక్కడైనా వైవిధ్యంపై దృష్టిపెడితేనే పోటీకీ, తద్వారా కొత్త ఆలోచనలకు ఆస్కారముంటుంది’ అని ఐఐఎం కోజికోడ్‌ డెరెక్టర్‌ దేబాశిష్‌ వివరించారు. మిగతా ఐఐఎంల్లోనూ కనీసం అమ్మాయిల సంఖ్య 30 శాతం.ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం... గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మేనేజ్‌మెంట్‌ విద్యపై ఆసక్తి చూపుతున్న వారిలో అమ్మాయిలే ఎక్కువ. అంటే.. నిర్ణయాత్మక స్థానాలపై మహిళలు పెడుతున్న దృష్టికి చిహ్నమిది. అది మన దేశంలోనూ మొదలైందన్న మాట. భవిష్యత్తులో లేడీ ‘బాస్‌’ లదే హవా కానుందనడానికీ సంకేతమిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని