మనసుకు నచ్చింది..

క్షణం తీరికలేని జీవితం.. బోర్‌ కొడుతోంది అని ఎవరికైనా అనిపించిందంటే కాస్తంత విరామం కావాల్సిందే అంటున్నారు నిపుణులు. తమ కోసం కొంత సమయాన్ని కేటాయించుకొని మనసుకు నచ్చింది చేయమని సూచిస్తున్నారు. నచ్చిందేంటి.. అని ఆలోచించొద్దు... గతంలో మీరెలా ఉండేవారో గుర్తుకు తెచ్చుకుంటే చాలు. ఇప్పుడు మీకేం కావాలో తెలుస్తుంది.

Updated : 31 Jul 2022 03:26 IST

క్షణం తీరికలేని జీవితం.. బోర్‌ కొడుతోంది అని ఎవరికైనా అనిపించిందంటే కాస్తంత విరామం కావాల్సిందే అంటున్నారు నిపుణులు. తమ కోసం కొంత సమయాన్ని కేటాయించుకొని మనసుకు నచ్చింది చేయమని సూచిస్తున్నారు. నచ్చిందేంటి.. అని ఆలోచించొద్దు... గతంలో మీరెలా ఉండేవారో గుర్తుకు తెచ్చుకుంటే చాలు. ఇప్పుడు మీకేం కావాలో తెలుస్తుంది.

అందమైన దృశ్యం చూసినా ఫొటో తీయాలనిపిస్తోందా... అయితే మొబైల్‌ ఉంటుంది కదా, ఫొటోగ్రాఫర్‌గా మారిపోండి. రోజూ కొంత సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్లండి. మీ కళ్లెదుట మానవీయంగా లేదా అందంగా కనిపించిన దృశ్యాలను ఫొటో తీసి, ఏదైనా మ్యాగ్‌జైన్‌కు పంపి చూడండి. మీకు నచ్చిన దాన్ని ఫ్రేంగా మార్చి గోడలకు తగిలించండి. మనసుకెంతో రిలీఫ్‌తోపాటు బోర్‌ అనే పదం దరి చేరదు.

వంటింట్లో.. నోరూరించే వంటలు మీకొస్తే అదే మీ అభిరుచి. కొత్తకొత్త వంటలపై ప్రయోగాలు, సాధన చేయండి. యూట్యూబర్‌గా మారి మీ పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించండి. బెరుకు లేకుండా మాట్లాడటం, ఎదుటి వారికి అవసరమైన సమాచారాన్ని అందించగలగడంలో కొద్దిగా ప్రావీణ్యాన్ని సంపాదిస్తే చాలు. మీ సమయం మరింత విలువైనది అవుతుంది. ఆర్థికంగానే కాదు, నచ్చిన దాంట్లో విజయాలు సాధించడం సంతృప్తినిస్తుంది. 

డిజైన్లు.. బాల్యంలో అమ్మ మెషిన్‌పై దుస్తులను కుట్టేటప్పుడు మీరు ఆసక్తి చూపించి ఉంటారు. ఆ సృజనాత్మకత మీలో ఉంటే, నచ్చినట్లుగా దుస్తులు డిజైన్‌ చేయండి. ఇంట్లోవాళ్ల స్పందన బాగుందంటే మీకీ పని వచ్చినట్లే. ఇంకెందుకు ఆలస్యం.. బోర్‌గా అనిపించినప్పుడల్లా మీ మెదడుకు పనిచెప్పండి. కొత్తకొత్త డిజైన్లు తయారు చేయండి.

గాయనిగా.. మీ కూనిరాగాల్లోనే చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం మీకెంత గుర్తుందో తెలుస్తుంది. మరికొంత సాధన చేస్తే మళ్లీ రాగాలు పలికించొచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మీలాంటి గాయనుల కోసం పలు వేదికలున్నాయి. వాటిలో పాడటానికి ప్రయత్నిస్తే చాలు. మీకో గుర్తింపు వస్తుంది. నచ్చిన ఈ అభిరుచి తృప్తినీ ఇస్తుంది.

కబుర్లు..  సరదాగా కబుర్లు, కథలు చెప్పడంలో మీరు దిట్ట అయితే..అందం, ఆరోగ్యంపై మీకు తెలిసిన చిట్కాలు చెప్పొచ్చు. ఇది ఆర్థికంగానూ మీకో మార్గాన్ని కల్పిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్