తిరస్కరణనీ.. అవకాశంగా!
ఉద్యోగ ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకూ వెళ్లి.. వస్తుందన్న నమ్మకంతో ఉన్నప్పుడు.. ‘సారీ మీరు ఎంపికవ్వలేదు’ అన్న బదులొస్తే బాధేస్తుంది కదా! దీన్నీ అవకాశంగా మార్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
ఉద్యోగ ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకూ వెళ్లి.. వస్తుందన్న నమ్మకంతో ఉన్నప్పుడు.. ‘సారీ మీరు ఎంపికవ్వలేదు’ అన్న బదులొస్తే బాధేస్తుంది కదా! దీన్నీ అవకాశంగా మార్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
* ఎంపికవ్వలేదని మెయిల్ రాగానే చూసి వదిలేస్తున్నారా? అదే చేయొద్దు. జవాబివ్వండి. ముందు ఇంటర్వ్యూ నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పండి. ఎక్కడ వెనకబడ్డారో తెలుసుకోవాలనుందని ‘ఫీడ్‌బ్యాక్’ కోరండి. అవకాశం చేజారినందుకు బాధపడుతున్నట్టు చెప్పొచ్చు. అయితే మరీ వివరించొద్దు. జవాబు వీలైనంత చిన్నగా ఇవ్వండి.
* ఫీడ్ బ్యాక్ ఇస్తూ మెయిల్ రాలేదా మీరు కోల్పోయిందేమీ లేదు. వచ్చిందా.. ఎక్కడెక్కడ పొరబాట్లు చేశారో తెలుస్తుంది. దీంతో భవిష్యత్ ఇంటర్వ్యూల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అర్థమవుతుంది. ఇంకా వాళ్ల లింక్‌డిన్ ఖాతా వివరాలను తెలుసుకోండి. అనుసరిస్తుంటే భవిష్యత్‌లో ఇతర అవకాశాలేమైనా ఉంటే తెలుస్తాయి. ఇతర రిక్రూటర్లతో పరిచయాలు ఏర్పడతాయి. ఇదీ లాభించే విషయమే.
* వాళ్ల సామాజిక మాధ్యమాలు అనుసరిస్తున్నప్పుడూ సందర్భమున్నప్పుడు పలకరించొచ్చు. అయితే విసిగించేలా ఉండకూడదు. అతి స్నేహమూ పనికిరాదు. సందేహాలు, సూచనలు కోరడం వరకూ పరిమితమైతే జాబ్ మార్కెట్ ధోరణులపై స్పష్టమైన అవగాహన ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.