వాళ్లని ఫాలో అవుతున్నారా?

మనం పనిచేసే రంగంలో ఏం జరుగుతోందో, ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకుంటూ ఉంటేనే కెరియర్‌లో నిలిచేదీ, గెలిగేదీ. ఇవి తెలుసుకోవడానికి ఎన్నో వేదికలున్నా, ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ లింక్డిన్‌ ముందు వరసలో ఉంటుంది. ఇందులో వివిధ రంగాల నిపుణులు పంచుకునే విషయాల్ని మనం నేరుగా తెలుసుకోవచ్చు. అందుకేం చేయాలంటే..

Published : 08 Aug 2022 00:20 IST

మనం పనిచేసే రంగంలో ఏం జరుగుతోందో, ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకుంటూ ఉంటేనే కెరియర్‌లో నిలిచేదీ, గెలిగేదీ. ఇవి తెలుసుకోవడానికి ఎన్నో వేదికలున్నా, ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ లింక్డిన్‌ ముందు వరసలో ఉంటుంది. ఇందులో వివిధ రంగాల నిపుణులు పంచుకునే విషయాల్ని మనం నేరుగా తెలుసుకోవచ్చు. అందుకేం చేయాలంటే..

సాధారణంగా ఎవరైనా లింక్డిన్‌లో కనెక్షన్లు పెంచుకోవడానికి చూస్తారు. మీ కనెక్షన్స్‌లో ఎక్కువగా పరిచయం, ముఖపరిచయం ఉన్నవాళ్లు.. అంటే.. సహోద్యోగులు, క్లాస్‌మేట్స్‌, స్నేహితులూ, వ్యాపార భాగస్వాములు ఉంటారు. మీ పరిధి పెరగాలంటే నేరుగా పరిచయం లేని వారినీ అక్కడ ఫాలో కావాలి.

ఎవర్ని ఫాలో కావాలీ, ఎలా ఫాలో కావాలన్న సందేహమా.. కంగారొద్దు, ఇది చాలా సులభం. మీ కనెక్షన్స్‌ ఎక్కువగా ఎవరిపైన, ఎవరి రచనలపైన ఆసక్తి చూపిస్తారో వారి పోస్టులు మీకు కనిపిస్తాయి. అలా వచ్చినవాటిని చదవండి. మీకూ నచ్చితే ఆ వ్యక్తి పేరు పక్కనే ‘ఫాలో’ ఆప్షన్‌ ఉంటుంది. దానిమీద క్లిక్‌ చేస్తే చాలు. అప్పట్నుంచీ వారు పోస్ట్‌ చేసే ప్రతీదీ మీ ఫీడ్‌లో కనిపిస్తుంది.

కొత్తగా లింక్డిన్‌లోకి వచ్చినవాళ్లకి కనెక్షన్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల వైవిధ్యమైన ఫీడ్‌ ఉండకపోవచ్చు. అలాగే మీరు పనిచేస్తున్న, ఆసక్తి చూపే రంగాలు వేరుకావొచ్చు. అలాంటప్పుడు సెర్చ్‌లో నచ్చిన అంశం, రంగం గురించి టైప్‌ చేయగానే అవి కనిపిస్తాయి. అక్కడే ఆ రచయితని ఫాలో అయ్యే వెసులుబాటూ ఉంటుంది. ఏదైనా కంపెనీ గురించి సెర్చ్‌ చేసినపుడు కథనాలు రాసిన వారి వివరాలూ చూపుతారు. వారినీ ఫాలో కావొచ్చు. తరచూ సెర్చ్‌ చేయడంవల్ల తెలియని కొత్త రచయితలు కనిపిస్తారు. వారిని ఫాలో అవుతూ వెళ్లొచ్చు.

మీ కనెక్షన్స్‌తోపాటు మీరు ఫాలో అవుతున్నవారి నుంచి కూడా ఫీడ్‌ వస్తుంది. వాటిదగ్గర మీ ఆలోచనల్నీ జోడించి సంభాషించవచ్చు. మీ అభిప్రాయాలు నచ్చితే మీకూ కనెక్షన్లూ, మిమ్మల్ని ఫాలో అయ్యేవారూ పెరగొచ్చు. ఇవన్నీ కెరియర్‌లో ఎంతో ఉపయోగపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని