అభిమానం.. అరచేతిలో..!

మువ్వన్నెల జెండా ముచ్చటగా ఎగురుతోంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అలాంటి అపురూప దృశ్యాన్ని చూడగానే మన మదిలో ఏదో తెలియని భావోద్వేగం పుట్టుకొస్తుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవ్వబోతున్న సందర్భంగా ఎక్కడ చూసినా జాతీయ పతాకం

Published : 15 Aug 2022 02:21 IST

మువ్వన్నెల జెండా ముచ్చటగా ఎగురుతోంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అలాంటి అపురూప దృశ్యాన్ని చూడగానే మన మదిలో ఏదో తెలియని భావోద్వేగం పుట్టుకొస్తుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవ్వబోతున్న సందర్భంగా ఎక్కడ చూసినా జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. ప్రజలందరూ ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన గృహిణి మల్లా సునీత తనదైన శైలిలో 75 చిట్టి చిట్టి జెండాలను తయారుచేసి దేశ భక్తిని చాటుతున్నారు. అరచేతిలో పట్టేలా ఉండే ఈ జెండాలను క్లే, కాగితాలు, వెదురు పుల్లలతో తయారుచేశారు. మినియేచర్‌లో ఎన్నో రకాల బొమ్మలను తయారు చేస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్