పనిచేసే చోట ‘పెర్మా’...

ఆఫీస్‌లో విధులు నిర్వహించేటప్పుడు బాధ్యత, అంకిత భావంతోపాటు సంతోషంగానూ పని చేయాలంటున్నారు  నిపుణులు. పాజిటివ్‌ ఎమోషన్స్‌, ఎంగేజ్‌మెంట్‌, రిలేషన్‌షిప్స్‌, మీనింగ్‌, ఎకంప్లిష్‌మెంట్‌ (పెర్మా)గా వ్యవహరించాలని సూచిస్తున్నారు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు...

Published : 18 Aug 2022 01:22 IST

ఆఫీస్‌లో విధులు నిర్వహించేటప్పుడు బాధ్యత, అంకిత భావంతోపాటు సంతోషంగానూ పని చేయాలంటున్నారు  నిపుణులు. పాజిటివ్‌ ఎమోషన్స్‌, ఎంగేజ్‌మెంట్‌, రిలేషన్‌షిప్స్‌, మీనింగ్‌, ఎకంప్లిష్‌మెంట్‌ (పెర్మా)గా వ్యవహరించాలని సూచిస్తున్నారు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు.

ద్యోగులు ఏటా 2,117 గంటల సమయం ఆఫీస్‌ విధులకు వినియోగిస్తున్నారని, వారి జీవితంలో 35 శాతం సమయాన్ని ఉద్యోగానికే కేటాయిస్తున్నారని ఆక్స్‌ఫర్డ్‌ నిపుణుల అధ్యయనంలో తేలింది. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఎలా ఉండాలి తదితర అంశాలను చర్చించిన ఈ నివేదిక హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూలో ప్రచురితమైంది. జీవితంలో ఇంత విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు దాన్ని అర్థవంతంగా పూర్తిచేయాలని చెబుతున్నారు నిపుణులు. బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు సానుకూల భావోద్వేగాలు (పాజిటివ్‌ ఎమోషన్స్‌) ఉండాలని, ప్రతికూలంగా భావోద్వేగాలను దూరంగా ఉంచాలని, ప్రతి ఒక్కరిలో ఉత్సాహం, సంతోషం, కరుణ, జాలి, ఆశావాదం వంటివీ అవసరమే అని చెబుతున్నారు. ఇవన్నీ ఉద్యోగబాధ్యత, సహోద్యోగులు, సంస్థపై అవగాహన పెంచుతాయట. తరచూ పనికి గైర్హాజరుకావడమూ తగ్గుతుంది. బృందంలో ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను గుర్తించి సకాలంలో పూర్తి చేయాలి. అందుకు ప్రతి ఒక్కరికీ ఈ రకమైన భావోద్వేగాలుంటేనే మంచిది.

గుర్తించి.. కేటాయించిన పనిలో తమ పాత్రను గుర్తించి, మనస్ఫూర్తిగా పూర్తిచేయడానికి ముందుండాలి. బద్ధకించడం, అవతలి వారిపై ఆ పనిని రుద్దేయడం కాకుండా, ప్రాజెక్ట్‌లో ముందుకొచ్చి స్థానాన్ని కల్పించుకోవాలి. అది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే కలిసికట్టుగా పనిచేస్తే విజయాన్ని సాధించొచ్చు. అటువంటి అనుబంధాన్ని ఒకరికొకరు కల్పించుకోవాలి. జట్టులో ఆరోగ్యకరమైన పోటీ తత్వం ఉండాలి. ఇది పనిపై ప్రతికూల ప్రభావాన్ని చూపెట్టకుండా ఉంటుంది. సమైక్యంగా పనిచేస్తూ, ఒకరిని మించి మరొకరు నాణ్యంగా చేయడానికి పోటీ పడాలి. అప్పుడే బృందమంతటికీ పేరొస్తుంది.

అర్థవంతంగా.. చేపట్టే పనిపై అవగాహన ఉండాలి. దాన్ని గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ పని అర్థవంతంగా పూర్తవుతుంది. తెలియకపోతే శిక్షణ తీసుకొని అవగాహన పెంచుకోవాలి. లేదంటే ఫలితం ఉండదు. అంతే కాదు, చేసే పనిపై ఆసక్తి ఉండకపోతే సత్ఫలితాలు రావు. అలాగే ఏదో పని పూర్తయ్యింది అని కాకుండా పూర్తి ఫలితం వచ్చేలా ప్రయత్నించాలి. రోజంతా గంటలతరబడి కష్టపడ్డామనే ఆలోచన కాకుండా, కొంత పని చేసినా.. పరిపూర్ణత వచ్చిందా లేదా పరిశీలించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్