అలారం అవసరం లేదు...

మాధవి రోజూ ఆలస్యంగానే నిద్ర లేస్తుంది. అలారం పెట్టినా ఒక్కోసారి ఆపేసి మళ్లీ నిద్రలోకి జారిపోతుంది. దీంతో ఇంటిపని ఆలస్యమై, ఆఫీస్‌కూ లేట్‌ అవుతుంది. ఇలా అలారం అవసరం లేకుండా ఉండాలంటే మూడు అంశాలను పాటించాలంటున్నారు నిపుణులు. దినచర్య సక్రమంగా జరగాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండాలి. ఉదయం త్వరగా నిద్రలేస్తే రోజంతా...

Published : 20 Aug 2022 00:31 IST

మాధవి రోజూ ఆలస్యంగానే నిద్ర లేస్తుంది. అలారం పెట్టినా ఒక్కోసారి ఆపేసి మళ్లీ నిద్రలోకి జారిపోతుంది. దీంతో ఇంటిపని ఆలస్యమై, ఆఫీస్‌కూ లేట్‌ అవుతుంది. ఇలా అలారం అవసరం లేకుండా ఉండాలంటే మూడు అంశాలను పాటించాలంటున్నారు నిపుణులు.  

దినచర్య సక్రమంగా జరగాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండాలి. ఉదయం త్వరగా నిద్రలేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. పనులన్నీ వేళకు పూర్తవుతాయి. పనిలో నాణ్యత లోపించదు. శారీరక, మానసికాందోళనకు దూరంగా ఉండొచ్చు. ఎంత త్వరగా నిద్రపోతే, అంత త్వరగా లేవచ్చు.

సాంకేతికతకు దూరంగా.. టీవీ, ల్యాప్‌టాప్‌, ఫోన్‌ వంటి వాటిని నిద్రకు గంట ముందుగానే దూరంగా పెట్టేయాలి. వీలైనంత త్వరగా బెడ్‌పైకి మీదకి చేరితే మంచిది. రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. తొమ్మిది గంటలకు నిద్రపోవాలనుకుంటే ఎనిమిదికే గ్యాడ్జెట్లను దూరంగా ఉంచాలి. లేదంటే వీటి వెలుతురు కంటిని ఒత్తిడికి గురిచేసి, నిద్ర రాకుండా చేస్తుంది.

తేలికగా.. రాత్రిసమయాల్లో వీలైనంత త్వరగా, తక్కువ మోతాదులో తినాలి. అప్పుడు జీర్ణాశయంపై ఒత్తిడి ఉండదు. తిన్నదీ త్వరగా జీర్ణమవుతుంది. ఆహారం తీసుకోవడానికి, నిద్రపోవడానికి మధ్యలో కనీసం రెండు గంటల సమయం ఉండాలి. ప్రాసెస్డ్‌ ఫుడ్‌ను తీసుకోకూడదు. వీటివల్ల అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు ఉత్పన్నమై, నిద్రను దూరం చేస్తాయి. కూరగాయల సూప్‌, సలాడ్‌ వంటివి డిన్నర్‌కు మంచిది. పోషకాలు అంది, త్వరగా జీర్ణమవుతాయి.

ఉదయం.. నిద్రలేచిన వెంటనే ఏయే పనులు చేయాలనే దానిపై ఓ ప్రణాళిక ఉండాలి. వ్యాయామం తప్పనిసరి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగడం, తేలికగా జీర్ణమయ్యే అల్పాహారం వంటివి జీవక్రియలను సమన్వయం చేస్తాయి. ఇవన్నీ శరీరానికి క్రమశిక్షణను అలవరుస్తాయి. బద్ధకించకుండా ఉత్సాహంగా నిద్రలేవాలి, ఫలానా పని పూర్తిచేయాలనే ఆలోచన కూడా మెదడును ఉదయానికి అలర్ట్‌గా ఉంచుతుంది. ఇది మెదడుకు రోజూ వ్యాయామంలా మారుతుంది. అలారం అవసరం లేకుండానే అనుకున్న సమయానికి మెలకువ వచ్చేలా చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్