పోటీలో నిలవాలంటే..
పని, వేళలు అన్నీ సమానమైనా సంస్థల్లో అవకాశాలకొచ్చేసరికి ఇప్పటికీ మనం వెనకే! ఈ పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు మొదలైంది. వాటిని అందుకోవాలంటే మన నుంచీ కొంత ప్రయత్నం కావాలంటున్నారు నిపుణులు.
పని, వేళలు అన్నీ సమానమైనా సంస్థల్లో అవకాశాలకొచ్చేసరికి ఇప్పటికీ మనం వెనకే! ఈ పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు మొదలైంది. వాటిని అందుకోవాలంటే మన నుంచీ కొంత ప్రయత్నం కావాలంటున్నారు నిపుణులు.
* ‘మన పని మనం చేసుకుంటూ వెళదాం.. గుర్తింపు అదే వస్తుంది’ మనలో చాలామంది ధోరణి ఇదే! కానీ ఇది తగదు. సంస్థ చిన్నదైనా, పెద్దదైనా మీ లక్ష్యంపై మీరు స్పష్టంగా ఉండాలి. ఎదుటివారి దగ్గర వ్యక్తపరచడానికీ వెనకాడొద్దు. అభిప్రాయాలు చెప్పడానికి వెనకాడొద్దు. ఏమనుకుంటారో అని మొహమాటపడటమే మనల్ని వెనక్కి లాగే అంశమంటారు నిపుణులు. మీ పని గురించి మీరే చెప్పుకోవాలి. సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవే మిమ్మల్ని పోటీలో నిలబెట్టి కోరుకున్న స్థాయికి చేరుస్తాయి.
* ఆలోచనలున్నా వ్యక్తపరచడమెలాగో తెలీయడం లేదా? అంటే కమ్యూనికేషన్లో వెనుకబడ్డట్టే.. ముందు ఈ నైపుణ్యాన్ని పెంచుకునే దారుల్ని వెతకండి. మాటలతో మాయ చేయనక్కర్లేదు కానీ.. ఒప్పించడమెలాగో తెలుసుకోండి. మీ బృందంలో ఎవరైనా ఉంటే వారిని గమనించండి. ప్రాజెక్టు, మీటింగ్‌కు సిద్ధమయ్యే ముందే మీరు చెప్పాలనుకున్న విషయం, దానికి సంబంధించి ఎదురయ్యే ప్రశ్నలు ఆలోచించుకొని సమాధానాలు సిద్ధం చేసుకోండి. ఆత్మవిశ్వాసం పెరిగుతుంది.
ఒక పరిశోధన ప్రకారం..
ఉన్నత స్థానానికి దరఖాస్తు చేసుకోవడానికి 60 శాతం అర్హత ఉన్నా మగవాళ్లు ప్రయత్నిస్తారట. కానీ మహిళలు మాత్రం 100 శాతం అర్హత ఉన్నా వెనకడుగు వేస్తారట. కారణం.. ఇంకా ఏమిలేవు అనేదే వెతుకుతూ, ఆలోచిస్తూ వెనకడుగు వేస్తారట. బలహీనతలు ఎవరిలో ఉండవు? ఎంతసేపూ మీ దృష్టి మీ బలాలను ప్రమోట్ చేయడంపైనే ఉండాలి. అప్పుడే ముందుకు వెళ్లగలుగుతారు. లేదూ కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి అనిపించిందా.. వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి.
* నెట్వర్కింగ్.. అవకాశాలను చేరువ చేసే మంత్రం. స్థాయి, హోదాతో సంబంధం లేకుండా అందరితో సత్సంబంధాలను నెరపండి. ఎవరినో మెప్పించాలనే ప్రయత్నం వద్దు. ప్రొఫెషనల్ చర్చలు కొనసాగించినా చాలు. కావాలంటే మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు లేదూ వాళ్ల అనుభవాల గురించి తెలుసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!