వ్యాపారవేత్తగా ఎదగాలంటే..

చదువు పూర్తయిన వెంటనే సొంతంగా వ్యాపారంలో అడుగుపెట్టాలనుకోవడంతో సరిపోదంటున్నారు నిపుణులు. అందులో విజయం సాధించడానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో సూచిస్తున్నారు. వ్యాపారరంగంలో పోటీ తట్టుకొని నిలబడాలంటే ప్రణాళికాబద్ధంగా అడుగులేయాలి. సమయపాలన, క్రమశిక్షణ, ఒత్తిడికి దూరంగా ఉండటం వంటి అలవాట్లు విజయం సాధించడానికి మెట్లు. ముందుగా....

Published : 30 Aug 2022 00:37 IST

చదువు పూర్తయిన వెంటనే సొంతంగా వ్యాపారంలో అడుగుపెట్టాలనుకోవడంతో సరిపోదంటున్నారు నిపుణులు. అందులో విజయం సాధించడానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో సూచిస్తున్నారు.

వ్యాపారరంగంలో పోటీ తట్టుకొని నిలబడాలంటే ప్రణాళికాబద్ధంగా అడుగులేయాలి. సమయపాలన, క్రమశిక్షణ, ఒత్తిడికి దూరంగా ఉండటం వంటి అలవాట్లు విజయం సాధించడానికి మెట్లు. ముందుగా ఎంచుకున్న రంగంపై సమగ్రమైన అవగాహన పొందాలి. పరిశోధనతోపాటు అధ్యయనం చేయాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. అనుకున్న రంగంలో కొంత సాధన అవసరమవుతుంది. ఇందు కోసం శిక్షణ తీసుకుంటే మెలకువలు తెలుస్తాయి. అందులో అడుగుపెడితే ఎంత వరకు విజయం సాధించొచ్చు అనేది అర్థమవుతుంది.  

ప్రాముఖ్యత..

మార్కెట్‌లో ఏయే బిజినెస్‌లు లాభదాయకంగా ఉన్నాయో పరిశీలించిన తర్వాత మాత్రమే వాటికి ప్రాముఖ్యతనివ్వాలి. వరుసగా పట్టికలా తయారుచేసి దేనికెంత పెట్టుబడి అవసరం అవుతుందో తెలుసుకోవాలి. లాభనష్టాలను బేరీజు వేయాలి. పెట్టుబడి పెట్టిన ఎంతకాలానికి ఆదాయం, లాభాలు ఉంటాయో కూడా అధ్యయనం చేయాలి. మీరనుకుంటున్న రంగంలో విజయం సాధిస్తున్నవారిని కలిసి మాట్లాడాలి. అందులోని కష్టనష్టాలను తెలుసుకుంటే భవిష్యత్తు ప్రణాళికపై మీకు అవగాహన కలుగుతుంది. అప్పుడే ఏదో ఒకదాన్ని ధైర్యంగా ఎంచుకోవచ్చు.

నెట్‌వర్క్‌..

ప్రస్తుతం చాలా స్టార్టప్‌లు ఆన్‌లైన్‌లోనే ప్రారంభమవుతున్నాయి. వాటి గురించి ఆరా తీయాలి. మార్కెటింగ్‌లో మిగతావారు ఏం మెలకువలను పాటిస్తున్నారో గుర్తించాలి. అవసరమైతే ఎంచుకున్న అంశంపై మరింత అవగాహన పెంచుకోవడానికి ప్రత్యేక కోర్సులు పూర్తిచేయడం మంచిది. నెట్‌వర్క్‌ను అనుసరించడంలో వెనుకబడకూడదు. అప్పుడే ఏయే రంగాలు ఇప్పుడు లాభదాయకంగా నడుస్తున్నాయో తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో పేరుపొందిన పెద్ద సంస్థలు ప్రారంభదశలో ఎలాంటి అంశాలతో మార్కెట్‌లోకి అడుగుపెట్టాయో అధ్యయనం చేయాలి. మీరనుకుంటున్న రంగంలో ఉన్న సంస్థలు, వారి వ్యాపార విధానం, లాభాలు వంటివన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ప్రారంభ దశలో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను దాటి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయగలగాలి. అడ్డంకులు వచ్చినా జంకకండి. అప్పుడు విజయం మీదే అవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని