పండగపూట విందు మాట!
పండగరోజులంటే రకరకాల మిఠాయిలు, వంటకాల సందడి మొదలవుతుంది. ‘ఈ ఒక్కరోజే కదా’ అనుకుంటూ కాస్త ఎక్కువగానే స్వీట్లవీ లాగించేస్తాం. అదీ నిజమే అయినా... కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కెలొరీల సమస్య నుంచి బయటపడొచ్చు.
పండగరోజులంటే రకరకాల మిఠాయిలు, వంటకాల సందడి మొదలవుతుంది. ‘ఈ ఒక్కరోజే కదా’ అనుకుంటూ కాస్త ఎక్కువగానే స్వీట్లవీ లాగించేస్తాం. అదీ నిజమే అయినా... కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కెలొరీల సమస్య నుంచి బయటపడొచ్చు.
* వీలైనంత వరకూ పూజా కార్యక్రమాల్ని ప్రణాళిక ప్రకారం పూర్తి చేసుకుంటే మేలు. ఆలస్యమయ్యే కొద్దీ ఆకలి పెరుగుతుంది. నీరసం ముంచుకొస్తుంది. దాంతో పూజ పూర్తవ్వగానే ఆకలికొద్దీ ఏదో ఒకటి తినేస్తుంటాం. ఇది ఆరోగ్యానికి
మంచిది కాదు.
* మిఠాయిల్లేకుండా ఏ పండగా ఉండదు. వీలున్నంత వరకూ బయట బజారులో కొన్న వాటికన్నా... ఇంట్లో చేసిన మిఠాయిలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే బయటకొన్న వాటిల్లో పంచదార వినియోగం ఎక్కువ. నిల్వకారకాల్నీ వాడతారు. ఈ రెండూ ఆరోగ్యానికి హానిచేసేవే.
* సెలవురోజు. ఇంట్లోనే ఉంటాం కాబట్టి.. ఎక్కువ తినేస్తుంటాం. అరె ఎక్కువ తినేశానే అని అనుకోకుండా ఉండాలంటే.. ఏం తిన్నా ఓ చిన్న గిన్నెలో తినండి. అదనపు కెలొరీలు చేరవు.
* ఇంట్లోనే మిఠాయిలు చేస్తుంటే పంచదారకి బదులు బెల్లం వాడి చూడండి. నాణ్యమైన నెయ్యి, నూనెలని ఎంచుకోండి. అలాగే బయట నుంచి తెచ్చిన కూల్‌డ్రింక్స్‌కి బదులు... తాజాగా చేసిన పండ్ల రసాలు మేలు. నిమ్మరసం మంచి ప్రత్యామ్నాయం. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.