వాళ్లని దూరం పెట్టండిలా!
కొందరు వ్యక్తులు పక్కనుంటే తెలియని అభద్రత, అసౌకర్యం. మీకూ ఇలాంటి అనుభవం ఉందా? దాదాపు 84 శాతం మహిళలు జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారని సర్వేలు చెబుతున్నాయి. మరి అలాంటి కనిపించని శత్రువుల్ని గుర్తించడం ఎలా?
కొందరు వ్యక్తులు పక్కనుంటే తెలియని అభద్రత, అసౌకర్యం. మీకూ ఇలాంటి అనుభవం ఉందా? దాదాపు 84 శాతం మహిళలు జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారని సర్వేలు చెబుతున్నాయి. మరి అలాంటి కనిపించని శత్రువుల్ని గుర్తించడం ఎలా?
ఎలాంటివారితో ఇబ్బందో గుర్తించేదెలా అంటే... అది మీకే సులభంగా తెలుస్తుందంటున్నారు నిపుణులు. ఎవరితో మాట్లాడుతుంటే, ఎవరు దగ్గరగా ఉంటే మీ కండరాలు బిగుసుకుపోతాయో, శ్వాస తీసుకోవడంలో మార్పులు వస్తాయో, ఎవరి మాటలు, చేతలు ఇబ్బందనిపిస్తాయో.. అలాంటివారి ప్రవర్తన సహజంగా లేనట్టు. వాళ్లకు ఎదుటివారి గౌరవ మర్యాదల విషయంలో బాధ్యతగా ఉండరు.
* స్నేహితుల్లా కనిపిస్తూ: కొందరు అంత్యాక్షరి మొదలు ఆఫీసు వరకూ.. ప్రతిచోటా వారిదే పైచేయిగా ఉండాలనుకుంటారు. ఇంకొందరు అవసరం ఉన్నా లేకున్నా పొగుడుతూ ఏదో లాభం పొందాలనుకుంటారు. నిజమైన స్నేహంలో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుందని గ్రహించాలి.
* ఈ విషపురుగుల్ని గుర్తించడానికి: ఎవరి సమక్షంలో ఇబ్బందిగా అనిపిస్తుందో.. అలాంటి ఓ అయిదు పేర్లు రాయండి. వాటి ముందు వారి స్వభావానికి తగ్గట్టు ఓ విశేషణాన్ని చేర్చండి. వారెలాంటి వారో సులభంగా అర్థమైపోతుంది.
* వీళ్లని అదుపులో పెట్టాలంటే: ఎప్పుడూ కాస్త దూరంలో ఉంచాలి. వారి వద్ద ఎలాంటి భావోద్వేగాల్నీ చూపొద్దు. అవసరమైన మేరకే మాట్లాడాలి. సాయమడిగితే సున్నితంగా నే చేయలేనని చెప్పండి.
*వారికి దూరంగా ఉండాలంటే: సానుకూల వ్యక్తులకు దగ్గరగా ఉండటమూ ముఖ్యమే. మన సమయం, శక్తుల్లో 90 శాతం.. పరిచయస్థుల్లో కేవలం పది శాతం మందికి కేటాయిస్తాం. వారిలో మనకు ఇష్టమైన, మనల్ని అభిమానించే వాళ్లు ఉండేట్టు చూసుకోవాలి.
* మన వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. డైరీ రాసుకోవడం, యోగా చేయడం, టీ తయారు చేసుకోవడం... ఇలా మనకు నచ్చిన పనులకు సమయం కేటాయిస్తున్నామంటే నచ్చని వాటికి దూరంగా ఉంటున్నట్లే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.