రాజీనామా చేశాక..ఇవి చెక్‌ చేసుకున్నారా?

ఉద్యోగంలో చేరేప్పుడు ల్యాప్‌టాప్‌, మొబైల్‌ వంటివి కొన్ని సంస్థలే ఇస్తుంటాయి. మానేసేప్పుడు వాటిని తిరిగిచ్చేయాల్సి ఉంటుంది. ఇచ్చేముందు కొన్నింటిని చెక్‌ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. అవేంటంటే..

Updated : 08 Sep 2022 09:58 IST

ఉద్యోగంలో చేరేప్పుడు ల్యాప్‌టాప్‌, మొబైల్‌ వంటివి కొన్ని సంస్థలే ఇస్తుంటాయి. మానేసేప్పుడు వాటిని తిరిగిచ్చేయాల్సి ఉంటుంది. ఇచ్చేముందు కొన్నింటిని చెక్‌ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. అవేంటంటే..

* ల్యాప్‌టాప్‌, ఫోన్‌ అన్నాక ఫొటోలు, డాక్యుమెంట్లు వంటి వ్యక్తిగత ఫైళ్లను సేవ్‌ చేసుకోవడం మామూలే. ఇచ్చేముందు వాటిని డిలీట్‌ చేశామా లేదా అన్నది చెక్‌ చేసుకోవాలి. ఫొటోలు పద్ధతిగా ఉన్నా.. మార్ఫింగ్‌ సమస్య ఎదురవొచ్చు. మన కాంటాక్ట్‌ వివరాలు వేరే వాళ్లకు తెలిశాయంటే అనవసర ఇబ్బందులూ! కాబట్టి, ఈ విషయంలో పక్కాగా ఉండండి.

* మనకు ఉపయోగపడే సమాచారాన్నీ కాపీ చేసుకుంటుంటాం. అయితే అవి సంస్థకు అత్యవసరం అవొచ్చు. ఉదాహరణకు- నెట్‌వర్కింగ్‌లో భాగంగా క్లయింట్‌ నంబర్లు సేవ్‌ చేసుకున్నారనుకుందాం. ఒక క్లయింట్‌ను ఒప్పించి, మనతో పనిచేసేలా చేయడంలో మనం ఎంత కష్టపడ్డా, సంస్థకు అది మార్కెటింగ్‌ లేదా వ్యాపార రహస్యం అవొచ్చు. ఈ విషయంగా కొన్నిసార్లు చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. ఏదైనా ప్రెజెంటేషన్‌ టెంప్లేట్‌ నచ్చో, మరేదో కారణంగానో సేవ్‌ చేసుకున్నా ఇలాంటి సమస్యే ఎదురవుతుంది.

* కాపీ చేసుకున్నాం.. ఏం తెలుస్తుందిలే అనుకోవద్దు. సంస్థలు ఇచ్చే పరికరాలపై మానిటరింగ్‌ ఉంటుంది. వీటన్నింటినీ కాపీ చేయడం వంటివి చేస్తున్నప్పుడు దాన్ని పరికరం ‘అనాథరైజ్‌డ్‌ ట్రాన్స్‌ఫర్‌’గా గుర్తించొచ్చు. కాబట్టి హెచ్‌ఆర్‌ లేదా మీపై అధికారుల సలహా తీసుకొన్నాక కొనసాగిస్తే ఈ ఇబ్బంది ఉండదు.

* పని సులువవుతుందని బుక్‌మార్కులు పెట్టుకుంటాం. పాస్‌వర్డ్‌ ఆటోమేటిక్‌ సేవ్‌ చేసుకుంటాం. అలాంటివాటిని తొలగించాలి. యాప్‌లు వగైరాలను తొలగించేయాలి. అసరమైతే సిస్టమ్‌ని/ మొబైల్‌ని ‘ఫ్యాక్టరీ రీసెట్‌’ చేశాకే తిరిగి అప్పగించడం ఉత్తమం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్