నలుగురిలో కలవలేక..

అపర్ణ ఇంట్లో చాలా ఉత్సాహంగా కబుర్లు చెబుతుంది. బయటికెళ్లితే చాలు, నోరు తెరవడానికి భయం. ఉపాధ్యాయులెదుట లేదా తోటి విద్యార్థులతో మాట్లాడలేదు. ఇలా నలుగురిలో కలవలేకపోవడం ‘సోషల్‌ యాంగ్జైటీ డిజార్డర్‌’ అంటున్నారు నిపుణులు. దీన్నుంచి బయటపడకపోతే ఎదుగుదలకు ఆటంకం అవుతుందని హెచ్చరిస్తున్నారు...

Published : 13 Sep 2022 00:09 IST

అపర్ణ ఇంట్లో చాలా ఉత్సాహంగా కబుర్లు చెబుతుంది. బయటికెళ్లితే చాలు, నోరు తెరవడానికి భయం. ఉపాధ్యాయులెదుట లేదా తోటి విద్యార్థులతో మాట్లాడలేదు. ఇలా నలుగురిలో కలవలేకపోవడం ‘సోషల్‌ యాంగ్జైటీ డిజార్డర్‌’ అంటున్నారు నిపుణులు. దీన్నుంచి బయటపడకపోతే ఎదుగుదలకు ఆటంకం అవుతుందని హెచ్చరిస్తున్నారు.

సోషల్‌ ఫోబియాగా పిలిచే ఈ లక్షణం సాధారణంగా యుక్త వయసులో మొదలవుతుంది. శుభకార్యాలు, కాలేజీ కార్యక్రమాలకు హాజరు కావడానికి ఆసక్తి లేనట్లు అనిపించడం... పదిమంది మధ్యలో ఉన్నప్పుడూ ఒంటరిగా, దిగులుగా ఎవరితోనూ కలవకుండా ఉండటం.. ఈ ఫోబియా లక్షణాలే. దీన్నుంచి బయటపడలేకపోతే జీవితాంతం ప్రభావితం చేస్తూనే ఉంటుంది. వేదికల మీద ప్రసంగం ఇవ్వకపోయినా, కనీసం అందరూ మాట్లాడుకొనేటప్పుడు మీరూ మాట కలపడానికి ప్రయత్నించాలి. మీ మాటను ఎదుటి వారు స్వీకరించరేమో, వారికి నచ్చదేమో అనే ప్రతికూల ఆలోచనలు దరిచేరనివ్వకూడదు.  

బయటపడాలంటే..

ఈ లక్షణం చాలా నష్టాలను తెచ్చిపెడుతుంది. మానవ సంబంధాలు ఏర్పడవు. నలుగురితో కలిసి జీవించడమనే నైపుణ్యం రాదు. ఉద్యోగ బాధ్యతల్లో బృందంతో కలిసి పని చేయలేరు. ఫలితంగా కెరియర్‌లో పురోభివృద్ధి ఉండదు. ఇలాకాకుండా ఉండాలంటే, న్యూనతగా అనిపిస్తున్నా, ప్రతికూల ఆలోచనలు వస్తున్నా ఒంటరిగా ఉండొద్దు. నలుగురిలోకి వెళ్లండి. మాట్లాడలేకపోయినా, వారు చెప్పేది వింటూ ఉండాలి. స్నేహితులకు మీ సమస్యను చెప్పి, వారి సహాయం తీసుకోవాలి. కాలేజీ కార్యక్రమాలకు హాజరు కావాలి. వేదికపై ప్రసంగాలను వినడానికి ఆసక్తి తెచ్చుకోవాలి. ప్రతి అంశంపైనా అవగాహన పెంచుకోవాలి. దీంతో నాకేమీ తెలియదు అనే భావన నుంచి కొంతైనా తెలుసనే ఆలోచన కలిగి, ధైర్యమొస్తుంది. రోజూ వ్యాయామాలతోపాటు యోగా, ధ్యానం అలవరుచుకోవాలి. ఇవి శారీరక, మానసికస్థైర్యాన్నిస్తాయి. అవసరమైతే నిపుణులను సంప్రదించాలి. అప్పుడే ఈ ఫోబియాను జయించి, జీవితంలో, కెరియర్‌లో రాణించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్