వినండి కానీ.. పట్టించుకోవద్దు!

‘నీ నవ్వు నకిలీ. నీది నకిలీ స్త్రీవాదం..’ షార్క్‌ ట్యాంక్‌లో చేస్తున్నప్పుడే కాదు.. నేను వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ ఇలాంటి ట్రోలింగ్స్‌ చాలా విన్నాను. నేననే కాదు.. ఉన్నతస్థాయిలో

Published : 19 Sep 2022 00:33 IST

‘నీ నవ్వు నకిలీ. నీది నకిలీ స్త్రీవాదం..’ షార్క్‌ ట్యాంక్‌లో చేస్తున్నప్పుడే కాదు.. నేను వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ ఇలాంటి ట్రోలింగ్స్‌ చాలా విన్నాను. నేననే కాదు.. ఉన్నతస్థాయిలో ఉన్న అమ్మాయిలకు ఇవన్నీ సాధారణం. కాబట్టి, వాటిని చూసి బాధపడటం, భయపడటం దండగ. నీకు నువ్వు ఎంతవరకూ సురక్షితంగా, ఆనందంగా ఉన్నావన్నదే ముఖ్యం. ప్రతిదాన్నీ భావోద్వేగ కోణంలో చూడటం, ఓర్పుగా ఉండటం, ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి అడుగేయడం.. ఇవన్నీ మనలోపాలుగా చూస్తారు. కానీ ఇవే మన ఆయుధాలు. వ్యాపార రంగంలో రాణించే ఎంతోమంది మహిళలను ఇవే నడిపిస్తున్నాయి. దీనికితోడు మల్టీటాస్కింగ్‌ మనకున్న పెద్ద ఆయుధం. కాబట్టి, ఎవరైనా చేయలేవు అన్నారనుకోండి. వినండి.. ఆ మాటల్లో ఏవైనా మార్చుకోవాల్సినవి ఉంటే ప్రయత్నించండి. ఏమీలేవా.. పట్టించుకోకండి. అంతేకానీ వీటికి భయపడి కెరియర్‌ని వదులుకోవద్దు. నెట్‌వర్కింగ్‌ పెంచుకోండి. నేరుగా బిడియమైతే టెక్నాలజీని వాడుకోండి. ఎవరో అవకాశమిస్తారని మాత్రం ఎదురు చూడొద్దు. మీకు మీరే ప్రయత్నించాలి, సాధించుకోవాలి.
- నమితా థాపర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని