కూర్చొనే పొట్ట తగ్గించేయండి!
తిన్నదంతా పొట్ట దగ్గరికే చేరుతోందని ఎన్నిసార్లు అనుకునుంటాం! గంటలకొద్దీ కుర్చీకే పరిమితమయ్యే ఉద్యోగినులకు ఈ సమస్య మరీ ఎక్కువ. పరిష్కారమూ కూర్చొనే సాధించేయండిలా..
తిన్నదంతా పొట్ట దగ్గరికే చేరుతోందని ఎన్నిసార్లు అనుకునుంటాం! గంటలకొద్దీ కుర్చీకే పరిమితమయ్యే ఉద్యోగినులకు ఈ సమస్య మరీ ఎక్కువ. పరిష్కారమూ కూర్చొనే సాధించేయండిలా..
* కుర్చీలో రెండు పాదాలూ నేలను తాకేలా కాస్త ముందుకు కూర్చోండి. వెనక్కి తిరిగి మాట్లాడుతుంటాం చూడండి.. అలా శరీరాన్ని తిప్పాలి. అయితే తల, భుజాలు, నడుము మాత్రమే తిరగాలి. కాళ్లు నిటారుగానే ఉండాలి. ఒక్కోవైపు పది సెకన్ల చొప్పున ఉండాలి. రోజుకు పది సెట్లు చొప్పున చేస్తే చాలు.
* కుర్చీలో ముందుకు కూర్చొని మడమలు మాత్రమే నేలమీద తాకేలా కాళ్లు చాపాలి. కుర్చీని రెండు చేతులతో పట్టుకొని ముందుకు వీలైనంత వంగాలి. 20 సెకన్లపాటు అలాగే ఉండి, తిరిగి సాధారణంగా కూర్చోవాలి. ఇలా 15సార్లు చేస్తే సరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.