పొదుపులో 50-30-20

ఇప్పుడు ప్రతి దానికీ డెబిట్‌ కార్డు లేదా యూపీఐ వాడకం సాధారణమయ్యాయి. దీంతో సరదాగా స్నేహితులతో, పిల్లలతో బయటికి లేదా షాపింగ్‌కు వెళ్లినప్పుడు హ్యాండ్‌ బ్యాగులోని డెబిట్‌ కార్డు తీయడంతో ఖాతాలో ఉన్నది కాస్తా ఖాళీ అవుతోంది. నెలాఖరికి బ్యాలెన్స్‌ ఉండదు. ఇలా కాకుండా ఉండాలంటే ప్రణాళికాబద్ధంగా అడుగేయాలి. భర్తతోపాటు ఇంటి బాధ్యతల్లో పాలు పంచుకుంటూనే జీతంలోంచి ...

Published : 24 Sep 2022 00:35 IST

రమణికి నెల జీతం ఎక్కువే! ఎప్పటికప్పుడు పొదుపు చేయాలనుకున్నా.. నెల చివరికి చేతిలో పైసా మిగలదు. రమణిలాంటివారు పొదుపు చేయాలనుకుంటే 50-30-20 సూత్రాన్ని పాటించాలంటున్నారు ఆర్థిక నిపుణులు.

ప్పుడు ప్రతి దానికీ డెబిట్‌ కార్డు లేదా యూపీఐ వాడకం సాధారణమయ్యాయి. దీంతో సరదాగా స్నేహితులతో, పిల్లలతో బయటికి లేదా షాపింగ్‌కు వెళ్లినప్పుడు హ్యాండ్‌ బ్యాగులోని డెబిట్‌ కార్డు తీయడంతో ఖాతాలో ఉన్నది కాస్తా ఖాళీ అవుతోంది. నెలాఖరికి బ్యాలెన్స్‌ ఉండదు. ఇలా కాకుండా ఉండాలంటే ప్రణాళికాబద్ధంగా అడుగేయాలి. భర్తతోపాటు ఇంటి బాధ్యతల్లో పాలు పంచుకుంటూనే జీతంలోంచి ఎంతో కొంత తీసి పక్కనపెట్టాలనే ఆలోచన ప్రతి మహిళకూ ఉండాలంటున్నారు నిపుణులు.

వాటితో పాటే..

అద్దె, పిల్లల ఖర్చులు, మందులు, ఫీజులు, నిత్యావసరాలు, కరెంటు, ఫోన్‌, గ్యాస్‌ బిల్లులు ఏదీ ఆపడానికి వీలుండదు. ఇక రెండోది... పెళ్లి రోజు, పుట్టిన రోజు, సినిమాలు, పర్యటనలు, పిల్లలకు ఆటవస్తువులు, కొత్త దుస్తుల కొనుగోలు వంటి సరదాలు. ఇవి అవసరాలంత ముఖ్యమైనవి కావు. ప్రతినెలా ఖర్చులో ఎక్కువ భాగం ఈ రెండే కనిపిస్తుంటాయి. ఈ ఖర్చు పట్టికలో మూడో విభాగాన్నీ చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అదే పొదుపు. ఆదాయంలో నుంచి దీనికోసం కొంత తప్పకుండా కేటయించడం మంచిదని చెబుతున్నారు.    

ఈ సూత్రాన్ని..

నెల జీతం లేదా ఆదాయాన్ని 50-30-20 సూత్రాన్ని పాటించి ఖర్చుపెట్టాలి. మొత్తం నగదులో ముందు సగభాగాన్ని తీసి పక్కన పెట్టేయాలి. మిగిలిన సగాన్ని ఇంటి అవసరాలకు కేటాయించాలి. ఇలా తీసి ఉంచిన నగదులోనే అన్నీ సర్దుకునేలా ప్రణాళికాబద్దంగా ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత ఉన్న సగంలో 30 శాతాన్ని సరదాల కోసం తీయాలి. పుట్టినరోజులు, సినిమాలు, షికార్లూ ఇందులోనే పూర్తవ్వాలి. మిగిలిన 20 శాతం పొదుపు చేయాలి. ఇంటి అవసరాలు, సరదాలకు ముందుగానే 20 శాతాన్ని మొదట పొదుపు చేస్తే మరీమంచిది.  ఈ నగదు పిల్లల అవసరాలు, అనారోగ్యాలు వంటివాటికి ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్