సరైన సమాధానంతోనే

రాశి వెళ్లిన ఇంటర్వ్యూలో పాత కొలువు నుంచి బయటకెందుకు రావాలని అనుకుంటున్నావని అడిగితే, సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఇది ఆమె అర్హతలను తారుమారు చేసింది. దాంతో కొత్త కొలువును దక్కించుకోలేక పోయింది. అందుకే ఇలాంటి ప్రశ్నలనెలా ఎదుర్కోవాలో నిపుణులు చెబుతున్నారు...

Published : 14 Oct 2022 00:47 IST

రాశి వెళ్లిన ఇంటర్వ్యూలో పాత కొలువు నుంచి బయటకెందుకు రావాలని అనుకుంటున్నావని అడిగితే, సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఇది ఆమె అర్హతలను తారుమారు చేసింది. దాంతో కొత్త కొలువును దక్కించుకోలేక పోయింది. అందుకే ఇలాంటి ప్రశ్నలనెలా ఎదుర్కోవాలో నిపుణులు చెబుతున్నారు...

కొత్త చోటకు ఇంటర్వ్యూకెళ్లినప్పుడు పాత కొలువును వదిలి రావడానికి కారణాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఈ రెండింటికీ సరైన సమాధానం చెప్పడం అత్యంత ముఖ్యం. లేదంటే ఆశించింది దక్కదు. అందుకే సరైన సమాధానం చెప్పడానికి సిద్ధం కావాలి. పాత సంస్థ గురించి తక్కువగా మాట్లాడకూడదు. అలాగే అక్కడి బాధ్యతల్లో అసంతృప్తి కలిగిన కారణమే, ఈ కొత్త కొలువుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పడమూ సరికాదు. ఆచి తూచి చెప్పే సమాధానాలే కొత్తచోట అర్హత సాధించేలా చేస్తాయి.

ఇలా చెప్పొచ్చు..

గత సంస్థ నుంచి బయటకు రావడానికి కారణాన్ని పలురకాలుగా చెప్పొచ్చు. పాత సంస్థలో చాలా ఏళ్లగా చేస్తుండటంతో ఎదుగుదల కనిపించడం లేదనొచ్చు. ఆ అనుభవంతో వేరేచోట స్థానాన్ని దక్కించుకొని కొత్త లక్ష్యాలతో ముందుకెళ్లొచ్చని భావిస్తున్నట్లు చెప్పడం బాగుంటుంది.  మీ రంగంలో ఆధునిక సాంకేతికతను తెలుసుకొనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పినా ఫర్వాలేదు. పెరగనున్న ఆదాయంతో ఆర్థికంగానూ ఎదుగుదల ఉంటుందనే ఆలోచనే ఈ అడుగువేసేందుకు కారణమైందనాలి. చదువు పూర్తయ్యాక, తెలిసిన వాళ్లు చెప్పడంతో చేరానని, అయితే అనుకున్న కెరియర్‌కు సంబంధించిన అవకాశాలు ఇక్కడ ఉండటంతో ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పాలి. కలలు కన్న లక్ష్యాన్ని సాధించాలంటే ఈ తరహా సంస్థలో అవకాశాలుంటాయని తెలిసిందనాలి. నా నైపుణ్యాలన్నింటినీ వినియోగించే అవకాశం ఉండని పాత ఉద్యోగంలోకన్నా, సవాళ్లను ఎదుర్కొంటూ పనిచేయాలనే అభిప్రాయమే ఈ కొత్త ప్రయత్నమని చెబితే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్