ఒకదాన్నే ఎందుకు ప్రేమించాలి?
హీరోయిన్ అయిన కొత్తల్లో సెట్‌లో నేనొక్కదాన్నే అమ్మాయిని. మేకప్, దర్శకత్వం, కెమెరా, లైటింగ్.. అన్ని విభాగాల్లోనూ మగవారే. ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పు మొదలైంది.
అనుభవ పాఠాలు
హీరోయిన్ అయిన కొత్తల్లో సెట్‌లో నేనొక్కదాన్నే అమ్మాయిని. మేకప్, దర్శకత్వం, కెమెరా, లైటింగ్.. అన్ని విభాగాల్లోనూ మగవారే. ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పు మొదలైంది. రాణిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యా. పిల్లలు పెద్దయ్యాక తిరిగి నటించడం మొదలుపెట్టా. మానేసినప్పుడు చాలామంది పిచ్చిపని అన్నారు. షూటింగ్ కోసమని ఎక్కడికెళ్లినా అమ్మ నాతో వచ్చేది. నేనూ నా పిల్లలకు అలాంటి వాతావరణమే ఇవ్వాలనుకున్నా. వాళ్లకు ఊహ వచ్చాక తిరిగి నటన మొదలుపెట్టా. అప్పుడూ వింతగా చూసిన వారున్నారు. మహిళలు కెరియర్, కుటుంబాల్లో ఏదో ఒకటే ఎందుకు ఎంచుకోవాలి. ప్రేమిస్తే, చేయగలనన్న నమ్మకం ఉంటే రెండింటి సమన్వయమూ తేలికే. కెమెరా ముందు నటిని. ఇంటికెళితే కుటుంబానికే ప్రాధాన్యం. అలా ప్లాన్ చేసుకుంటున్నా. అందుకే నా పిల్లలకు నేను దూరమయ్యానన్న భావనుండదు. పైగా స్నేహితులెవరైనా నన్ను పొగిడితే గర్వంగా నాకొచ్చి చెబుతుంటారు. అందుకే తోటివారికీ ఒకటే చెబుతా. సమయం ఎప్పుడూ ఒకలా ఉండదు. నచ్చింది చేసేయండి. దానికి తగ్గట్టు పరిస్థితుల్లోనూ మార్పులొస్తాయి.
- మాధురీ దీక్షిత్, బాలీవుడ్ నటి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.