వ్యాపారంలోనూ కౌన్సెలింగ్‌ తీసుకోవచ్చు

హన్సిక ప్రారంభించిన స్టార్టప్‌ నష్టాన్నిచ్చేసరికి డీలా పడిపోయింది. చాలామంది మహిళలు తమకు తెలిసిన రంగాల్లో అడుగుపెట్టినా, ముందుకెళ్లలేకపోతారు. దీంతో నష్టాన్నెదుర్కొంటారు. కుటుంబ ప్రోత్సాహం అందితే ఫర్వాలేదు. లేదంటే మరొకటి మొదలుపెట్టాలన్నా... ధైర్యం సరిపోదు.

Published : 18 Nov 2022 00:16 IST

హన్సిక ప్రారంభించిన స్టార్టప్‌ నష్టాన్నిచ్చేసరికి డీలా పడిపోయింది. చాలామంది మహిళలు తమకు తెలిసిన రంగాల్లో అడుగుపెట్టినా, ముందుకెళ్లలేకపోతారు. దీంతో నష్టాన్నెదుర్కొంటారు. కుటుంబ ప్రోత్సాహం అందితే ఫర్వాలేదు. లేదంటే మరొకటి మొదలుపెట్టాలన్నా... ధైర్యం సరిపోదు. ఇలాంటి సమయాల్లో బిజినెస్‌ కౌన్సెలింగ్‌ తీసుకోవాలంటున్నారు నిపుణులు.

వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు నిర్ణయం సొంతమైనా.. దాని గురించి లోతైన సమాచారాన్ని పొందడానికి బిజినెస్‌ కౌన్సెలర్‌ను సంప్రదించడం మంచిది. ప్రస్తుతం మార్కెట్‌లో దాని లాభనష్టాలు, ప్రారంభించాక మధ్యలోనే ఆపకుండా నిరంతరం కొనసాగేలా చేయడానికి పాటించాల్సిన నియమ నిబంధనలు వంటివన్నీ వారి నుంచి తెలుసుకోవచ్చు. ఒక వేళ నష్టమెదురైతే కారణాలు కనుక్కొని వాటి నుంచి బయటపడటానికి వారి సాయాన్ని పొందొచ్చు.

సామర్థ్యాలు.. స్టార్టప్‌ను ప్రారంభించడానికి అతి తక్కువ సమయం ఉన్నప్పుడు కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడమెలాగో కౌన్సెలర్లు వివరిస్తారు. ఫైల్‌ మేనేజ్‌మెంట్‌, సమయపాలన, సత్వర నిర్ణయాలు తీసుకోవడం, మార్కెట్‌ విలువను గుర్తించి అడుగు వేయడం వంటి నిర్వహణ సామర్థ్యాలను సొంతంగా వచ్చేలా నేర్పుతారు. ఏయే అర్హతలున్న సిబ్బందిని ఎంచుకోవాలో సలహాలు, సూచనలిస్తారు. వ్యాపారంలో ఎదురయ్యే ఆందోళన, ఒత్తిడిలను ఎలా జయించాలో చెబుతారు.

అధ్యయనంతో... నష్టమెదురైనప్పుడు బిజినెస్‌ కౌన్సెలర్‌ సాయం తీసుకొంటే మంచిది. దీనిపై వారు పరిశోధన చేపడతారు. సిబ్బంది బాధ్యతలు, ముఖ్యమైన సందర్భాల్లో వ్యాపారవేత్తగా నిర్ణయాలెలా తీసుకున్నారు, మార్కెట్‌ గురించి పూర్తిగా అవగాహన ఉందా లేదా వంటివన్నీ పరిశీలిస్తారు. ఫైలింగ్‌లో లోపాలున్నాయేమో గుర్తిస్తారు. జరిగిన మంచి, చెడు విభజించి విశదీకరిస్తారు. ఎక్కడెక్కడ ఆనాలోచితంగా అడుగేశారో పరిశీలిస్తారు. వాటిని అర్థమయ్యేలా వివరిస్తారు. తిరిగి నష్టం కలగకుండా ఎలా జాగ్రత్తపడాలో చెబుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్