నొప్పించక నో చెప్పండి!

మిగతా సమయాల్లో ఎంత స్నేహంగా ఉన్నా.. ఆఫీసుల్లో మీటింగ్‌ సమయంలో మాత్రం సభ్యుల మధ్య విభేదాలు వస్తుంటాయి. ఒకరి ఆలోచనను మరొకరు వ్యతిరేకించడమే ఇందుకు కారణం. అలాగని అభిప్రాయాలను చెప్పకుండా ఉంటే మనకే నష్టం.

Updated : 03 Dec 2022 04:18 IST

మిగతా సమయాల్లో ఎంత స్నేహంగా ఉన్నా.. ఆఫీసుల్లో మీటింగ్‌ సమయంలో మాత్రం సభ్యుల మధ్య విభేదాలు వస్తుంటాయి. ఒకరి ఆలోచనను మరొకరు వ్యతిరేకించడమే ఇందుకు కారణం. అలాగని అభిప్రాయాలను చెప్పకుండా ఉంటే మనకే నష్టం. మరెలాగంటారా?

* ఎవరైనా సానుకూల దృక్పథంతోనే ఆలోచన పంచుకుంటారు. అవునా! అంటే వాళ్లూ మీలాగే ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఉంటారు. కాకపోతే మీ కోణం వాళ్లకి తట్టుండదు. కాబట్టి, నిందించినట్లుగా, ‘ఆ మాత్రం తెలియదా’ అన్న ధోరణిలో మాట్లాడకూడదు. కచ్చితంగా బెడిసి కొడుతుందన్నట్లుగా చెబితే అవతలి వాళ్లకీ అవమానంగా అనిపిస్తుంది. దీంతో గొడవ ప్రారంభమవుతుంది. లోపాలను సానుకూలంగానే ఎలా చెప్పొచ్చో చూడండి. వాళ్లూ అర్థం చేసుకుంటారు.

* ఇలాంటిచోట అనుభవం మొదట ప్రస్తావనకి వస్తుంది. ‘నీ అనుభవం ఎంత నాకు చెప్పడానికి’ అని అవతలివారన్నా.. ‘ఇన్నేళ్ల అనుభవం ఉంది నాకు తెలియదా’ అని మీరన్నా పొరపాటే. మీ అభిప్రాయాన్ని మీరెలా నమ్ముతున్నారో.. అవతలి వారూ అంతేనని గుర్తుంచుకోవాలి. వారు కోపగించుకుంటే మీరూ అదే దారిలోకి వెళ్లొద్దు. ‘మీ ఆలోచన సబబే.. కానీ.. ఫలానా విషయంలో ఇంకాస్త ఆలోచించాలి అనిపించింది, తప్పనిపిస్తే వదిలేయండి’ అని ముగించడం మేలు. దృష్టి మీ పాయింట్‌ చెప్పడంపైనే ఉండాలి.

* ఆఫీసులో అందరూ అందరికీ నచ్చాలని లేదు. నిజంగానే భిన్నాభిప్రాయాలు ఏర్పడితే సరే! వ్యక్తి నచ్చక వాళ్ల ఆలోచనని వ్యతిరేకించొద్దు. ముందు వాళ్లు చెప్పేది సానుకూలంగా వినండి. నిజంగానే వ్యతిరేకించాలా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సొంత ఫీలింగ్స్‌ ప్రభావం చూపట్లేదు అన్నాకే మాట్లాడండి. అలాగే కొద్ది పాటి మార్పులతో ఆలోచనను ముందుకు తీసుకోవచ్చా.. సూచించండి. అవతలి వ్యక్తిని ప్రత్యర్థిగా.. మీకన్నా ముందుకెళ్లిపోతున్నాడని భావించనక్కర్లేదు. వ్యక్తిగతానికీ, పనికీ తేడా చూపించేవాళ్లే దూసుకెళ్లగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్