బాస్‌ ధ్యాసంతా భార్య వ్యాపారంపైనే!

నిత్యం డెడ్‌లైన్స్‌తో పరుగులు.. పని విపరీతం. మా బాసేమో ఎప్పుడూ బిజీ.

Updated : 07 Dec 2022 13:06 IST

నిత్యం డెడ్‌లైన్స్‌తో పరుగులు.. పని విపరీతం. మా బాసేమో ఎప్పుడూ బిజీ. ఆఫీసు పని కంటే భార్య చేసే వ్యాపారాన్ని చూసుకోవడంలోనే గడిపేస్తుంటారు. పేరుకు ఆవిడ యజమాని.. పనంతా ఈయనదే. అదంతా ఆయన వ్యక్తిగతమైనా ప్రభావం నా పనిమీద పడుతోంది. నాకెప్పుడు అవసరమైనా అందుబాటులో ఉండరు. నాకేమో గడువు ముంచుకొస్తుంటుంది. ఒత్తిడితో పిచ్చెక్కిపోతోంది. అసలే ఇంటి నుంచి పని. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? 

- స్వప్న, హైదరాబాద్‌

 ఒకేసారి చాలా పనులు ఇప్పుడు సహజమే. అయితే చాలామంది పని గంటలు పెరగకుండానే ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఓవర్‌ ఎంప్లాయ్‌మెంట్‌గా పిలిచే దీనిలో.. ఒకే సమయంలో ఎక్కువ పూర్తి కాల ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే ఇది వాళ్లకే ప్రమాదమని గుర్తించరు. సంస్థ నుంచి ఇబ్బంది ఏర్పడొచ్చు. అలా జరగకపోయినా పనిపై సరిగా శ్రద్ధ చూపక ఇబ్బందులు ఎదురవొచ్చు. అదనంగా వస్తున్న డబ్బుతో విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడితే ఒక్కసారి అవి దూరమైతే మరిన్ని సమస్యలొస్తాయి. లాక్‌డౌన్‌లో చాలా పని ధోరణులొచ్చాయి. వాటిల్లో ఇదొకటి. అయితే సంస్థలు తమ ఉద్యోగికి పూర్తి సమయం, శ్రద్ధ పెడుతున్నందుకు జీతమిస్తున్నాయా? లేక ఎక్కడినుంచి, ఎలా పనిచేశారన్న దాంతో సంబంధం లేకుండా టాస్క్‌లు పూర్తిచేసినందుకా? రెండోదే అయితే.. ఉద్యోగి కంటే కాంట్రాక్టర్‌ అనొచ్చు కదా! ఏదేమైతేనేం.. ఇది మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తోంది. ముందు అతని పైవాళ్లకి ఈ విషయం తెలుసా? తెలిసీ అంగీకరించారా అన్నది కనుక్కోండి. పైవాళ్లకి తెలిసీ చేస్తోంటే.. మీరు చేయగలిగిందేమీ లేదు. పైగా అతను మీ బాస్‌ కాబట్టి, మీకే ఇబ్బంది. కాబట్టి, హెచ్‌ఆర్‌ వాళ్లను సంప్రదించండి. వేరే విభాగానికో, అధికారి కిందకో మార్చే వీలుందేమో చూసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని