సమస్య ఏంటో తెలుసుకోండి...

రాధ అనుకున్నట్లుగానే కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడింది. ఆఫీస్‌కి వెళ్లిన కొద్దిరోజులకే తోటి ఉద్యోగుల నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి.

Published : 28 Feb 2023 00:59 IST

రాధ అనుకున్నట్లుగానే కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడింది. ఆఫీస్‌కి వెళ్లిన కొద్దిరోజులకే తోటి ఉద్యోగుల నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. తానెంతగా వారితో కలవాలని ప్రయత్నిస్తున్నా వారు మాత్రం ఎడమొహంగానే ఉంటున్నారు. దాంతో ఉద్యోగం వదులుకోవాలనుకుంటోంది. మనలో చాలా మందికి ఎదురైన, ఎదురవుతున్న సమస్యే ఇది. ఏ రంగమైనా ఇలాంటివి సర్వసాధారణం... వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి అంటున్నారు కెరియర్‌ నిపుణులు...

నుకున్న ఉద్యోగం సాధించడం ఎంత ముఖ్యమో... పనిచేస్తున్న చోట ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం కూడా అంతే అవసరం. సహోద్యోగులు సరిగా లేరనో, ఇబ్బందులకు గురిచేస్తున్నారనో అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకోవడం... వేరే ఉద్యోగం వెతుక్కోవాలనుకోవడం మంచిది కాదు.

కలిసిపోండి...

కలివిడితనం ఉండి అందరితో సరదాగా, గౌరవంగా ఉండేవారిని ఎవరైనా ఇష్టపడతారు. ఆఫీస్‌కు వెళ్లిన వెంటనే వాళ్లతో మాట్లాడి, మీరు చేయాల్సిన పనులేంటో తెలుసుకోండి. సమయానికి పనులు పూర్తి చేస్తూ, అవసరమైతే సహోద్యోగుల పనుల్లో సహాయం చేయండి. దీనివల్ల వారిలో మీ పట్ల మంచి ఉద్దేశం మొదలవుతుంది.

సమస్య తెలుసుకోండి...

వాళ్లు మీతో అంటీ ముట్టనట్లుగా ప్రవర్తించడానికి కారణమేంటో తెలుసుకోండి. వారికి మీ పట్ల చెడు అభిప్రాయముంటే దాన్ని మార్చడానికి ప్రయత్నించండి. మీలో లోపాలు ఉంటే సరిదిద్దుకోండి.

పనితో సమాధానం...

ఏ రంగమైనా పనిచేసే విధానమే మిమ్మల్ని పరిచయం చేస్తుంది. సమయపాలన పాటించి ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయండి. అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించి మీదైన గుర్తింపును సాధించుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్