Published : 06/03/2023 00:15 IST

మీట నొక్కితే రక్షణ

చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలంటూ.... మహిళలూ పగలనక, రాత్రనక కష్టపడుతున్నారు. మరి కావలసిన ప్రదేశాలకు తీసుకెళ్లెందుకు అన్ని సమయాల్లో అయినవాళ్లుంటారా... ఎన్ని రోజులని వాళ్లమీద ఆధారపడతాం. మన రక్షణ బాధ్యత మనదే... అరచేతిలో ప్రపంచం ఉన్న రోజులివి. స్మార్ట్‌ఫోన్లు రాజ్యాలేలుతున్న సమయంలో మనకోసం ఒక ఆప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకుందామా...

‘‘విమెన్‌సేఫ్టీ’’ మొబైల్‌ అప్లికేషన్‌. ప్లేస్టోర్‌లో సులువుగా దొరుకుతుంది. ఒక్కసారి ఇన్‌స్టాల్‌ చేసుకున్నాం అంటే... ఎప్పటికప్పుడు మన వివరాలను అయినవాళ్లకు చేరవేస్తూనే ఉంటుంది. అవసరానికి ఎస్‌ఒఎస్‌ బటన్‌ నొక్కితే చాలు... అత్యవసరం అయినప్పుడు అంత సమయం ఉంటుందా... అని అడుగుతారా? పవర్‌ బటన్‌ని కొద్దిసేపు ప్రెస్‌చేసి ఉంచండి... మీరెక్కడ ఉన్నది తెలుస్తుంది. త్వరితగతిన రక్షణ చర్యలు అందుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని