Published : 16/03/2023 00:31 IST

వద్దనడం నేర్చుకోండి..

మనసులోని మాటను కచ్చితంగా ఇతరులకు చెప్పగలగటమూ ముఖ్యమే. దానివల్ల ఆత్మస్థైర్యం పెరగటమే కాకుండా, సమర్థవంతంగా పని చేయగలం. కానీ అలా ఎలా చేప్పేస్తాం అంటారా? ఈ నైపుణ్యాలు అలవరచుకుంటే మొహమాటపడకుండా చెప్పేయొచ్చట..!

సూటిగా చెప్పండి..

కాదు, లేదు అని చెప్పడానికి ఎప్పుడూ సంకోచించవద్దు. కొందరు ఎంత ఇబ్బందిగా ఉన్నా ఆ విషయాన్ని ఎదుటి వాళ్లకు చెప్పలేరు. అది మంచిది కాదు. ఎదుటివారిని గౌరవిస్తూనే చెప్పదలచుకున్న విషయాన్ని గట్టిగా చెప్పగలగాలి. అప్పుడే మన మాటకు కచ్చితత్వం ఉంటుంది.

సాధన అవసరం..

కచ్చితంగా ఉండటం అనేదీ ఒక నైపుణ్యమే. సాధనతో ఇది సాధ్యం. స్నేహితులు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు ఇలా ఎవరితోనైనా మన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలగాలి.

చిన్నగా మొదలుపెడదాం..

మొదటి రోజే పూర్తిగా మారిపోవాలని కాకుండా చిన్నగానే ప్రయత్నం చేద్దాం. ఇలా చేస్తూ ఉంటే రోజురోజుకీ మార్పు మొదలవుతుంది.

బాడీ లాంగ్వేజ్‌ ముఖ్యం..

మాటలతో చెప్పలేని ఎన్నో భావాలను బాడీ లాంగ్వేజ్‌తో చెప్పవచ్చు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు నిటారుగా నిల్చొని కళ్లలోకి చూస్తూ ఆత్మస్థైర్యంతో సూటిగా మాట్లాడండి. అవతలివారికి విషయం తేలిగ్గా అర్థమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని