సవాళ్లు స్వీకరించండి..

ఆఫీసులో ప్రతి దానికీ భయపడుతూ కూర్చోకూడదు. ఆడపిల్లలం మనమేం చేయగలం అనే భావన తీసి పక్కన పెట్టేయండి. ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లగలం.

Updated : 07 Apr 2023 20:21 IST

ఆఫీసులో ప్రతి దానికీ భయపడుతూ కూర్చోకూడదు. ఆడపిల్లలం మనమేం చేయగలం అనే భావన తీసి పక్కన పెట్టేయండి. ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లగలం.

* ఏదైనా పెద్ద ప్రాజెక్టు బాధ్యతలు అప్పజెప్పినప్పుడు నావల్ల కాదని తప్పించు కోవాలని చూస్తున్నారా. మీపై మీకే నమ్మకం లేకపోతే ఇక పై అధికారులు మాత్రం ఎలా నమ్మి పని ఇస్తారు. ఎంతటి పని ఇచ్చినా మీ శాయశక్తులా ప్రయత్నించి పూర్తి చేయండి. కుదరదనే మాట మర్చిపోండి. చేయగలను అనే మాటను జపించండి.

* మీటింగుల్లో మౌనంగా  కూర్చోవద్దు. మీకు తెలిసిన విషయంలో మాట కలిపి మీ ఆలోచనేమిటో వ్యక్తం చేయండి. ఇది నాకు సంబంధించిన విషయం కాదని ముఖం చాటేయొద్దు. మీ బాస్‌తోనే ఈ పనికి మీరే సరైన వారు అని చెప్పేలా చేసుకోండి.

* అందరినీ కలుపుకొనిపోవాలి. సహోద్యోగులతో సానుకూలంగా ప్రవర్తించండి. వారిది చిన్న హోదా వీరిది పెద్ద హోదా అనే విషయాన్ని మీ మనసులోంచి తీసేయండి. ఒకరిని తక్కువ అంచనా వేసి చూడటం మీ పురోగతికే అంత మంచిది కాదు.

* ఇంట్లో ఒత్తిడితో ఆఫీసుకు వస్తే దాని ప్రభావం పనిపై పడుతుంది. కావాలంటే సెలవు తీసుకొని మళ్లీ తాజాగా మొదలుపెట్టండి. అలాగే ఏ పని చేస్తున్నా తేలికగా చేసేందుకు ప్రత్యామ్నాయాలు చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని