సంతోష జీవనానికి తిరుగులేని గుళికలు

సాయం చేయండి... ఇతరులకు సాయం చేయండి. అందరితోనూ దయగా మెలగడం ద్వారా ఆక్సిటోసిన్‌ హార్మోన్లు విడుదలై సంతోషంగా ఉంటామని పరిశోధనలు చెబుతున్నాయి.

Published : 16 Apr 2023 00:51 IST

సాయం చేయండి... ఇతరులకు సాయం చేయండి. అందరితోనూ దయగా మెలగడం ద్వారా ఆక్సిటోసిన్‌ హార్మోన్లు విడుదలై సంతోషంగా ఉంటామని పరిశోధనలు చెబుతున్నాయి.

అతిగా ఆలోచించొద్దు... అన్ని విషయాలు మనం అనుకున్నట్లే జరగాలనీ, అందరినీ సంతృప్తి పరచాలనీ అనుకోవద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా మన పరిధిలో ఉన్న విషయాల మీదే దృష్టి సారించాలి. అప్పుడు ఒత్తిడికి లోనవకుండా ఆనందంగా ఉండగలం.

వ్యాపకంతో... రోజూ వారీ పనులు, బాధ్యతల్లో ఒకదానికొకటి మిళితం చేయకుండా మనకు సంతోషాన్నిచ్చే ఏదో ఒక పని కోసం నిత్యం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. పాటలు పాడటం, డ్యాన్స్‌ వేయడం, వయొలిన్‌ వాయించడం, చిత్రలేఖనం, ఆటలు ఇలా ఏదో ఒక పనిలో భాగస్వాములవ్వాలి.

నవ్వు మంచిదే... రోజూ నవ్వడానికి ప్రయత్నించాలి. నవ్వినప్పుడే వర్తమాన జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించగలం.

ఆశావాద దృక్పథం... మంచి లేదా చెడు దేన్నైనా సమానంగా స్వీకరించాలి. ప్రతి విషయాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు.

కృతజ్ఞతా భావంతో... జీవితంలో మనం పొందిన ప్రతి ఒక్క దానికి కృతజ్ఞతా భావంతో ఉండాలి. నిరాశా నిస్పృహలు దరిచేరినప్పుడు మనం ఏమేం పొందామో తలచుకొని సంతోషంగా ఉండగలగాలి.

వ్యాయామంతో ప్రయోజనం... అసలు వ్యాయామం చేయని వాళ్లకంటే రోజులో కనీసం పది నిమిషాల పాటు కసరత్తులు చేసేవాళ్లు ఎక్కువ సంతోషంగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని