వివరించి.. ముందుకెళ్లండి..
ఆడవాళ్లకు ఉద్యోగాలెందుకు.. చక్కగా పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకోమంటారు కొందరు. ఇంకొందరైతే మహిళలు వంటగదికే పరిమితమవ్వాలని ఆంక్షలు పెడుతుంటారు. జీవితంలో పైకి రావాలనే కోరిక ఉన్న మనం ఇలాంటివన్నీ మనసుకు తీసుకొని మొదలుపెట్టిన చోటనే ఆగిపోతుంటాం.
ఆడవాళ్లకు ఉద్యోగాలెందుకు.. చక్కగా పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకోమంటారు కొందరు. ఇంకొందరైతే మహిళలు వంటగదికే పరిమితమవ్వాలని ఆంక్షలు పెడుతుంటారు. జీవితంలో పైకి రావాలనే కోరిక ఉన్న మనం ఇలాంటివన్నీ మనసుకు తీసుకొని మొదలుపెట్టిన చోటనే ఆగిపోతుంటాం.. కానీ పైకి రావడానికి ఇప్పుడు అనేక అవకాశాలున్నాయి. ఉత్సాహంతో అందిపుచ్చుకొని దూసుకెళ్దాం..
పుట్టింట్లో..
చదువు పూర్తయ్యాక నేరుగా పెళ్లిచేసుకోమని సంబంధాలు చూస్తారు తల్లిదండ్రులు. పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరిపోతుందంటారు. వారికి తోడు ఉద్యోగం ఎందుకమ్మా చక్కగా పెళ్లి చేసుకోమంటూ సలహాలిస్తారు చుట్టుపక్కల వాళ్లు. ఎంతో ఇష్టంతో చదివి, కెరియర్‌లో స్థిరపడ్డాక వివాహం చేసుకుందామనుకున్న ఆశలు నిరాశలవుతాయి. అతి కష్టంమీద ఉద్యోగం చేయటానికి తల్లిదండ్రులను ఒప్పిస్తే ఇతరుల సూచనల కారణంగా మళ్లీ వెనకడగు వేయాల్సొస్తుంది. అలా జరగకుండా ముందు తల్లిదండ్రులను కూర్చోబెట్టి మీ అభిప్రాయం ఏంటో అర్థమయ్యేలా వివరించండి. ఉద్యోగం చేసేందుకు నచ్చజెప్పండి.
అత్తగారింట్లో..
పెళ్లయ్యాక ఉద్యోగం చేయాలనుకుంటే పెళ్లికి ముందే అత్తింటి వారితో విషయం చెప్పండి. సందేహాలుంటే నివృత్తి చేసుకోండి. మీరెందుకు ఉద్యోగం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. మీరు ఎదిగేందుకు వారికెటువంటి సమస్య లేదని చెబితేనే పెళ్లికి అంగీకరించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.