ఆత్మవిశ్వాసం ఉంటే చాలు..

నాలుగేళ్ల విరామం తర్వాత వెండితెరపై తిరిగి కనిపించబోతున్నా. ప్రసవం తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. అందరి తల్లుల్లానే నాక్కూడా నా కొడుకు ఆండ్రియానే మొదటి ప్రాధాన్యం.

Updated : 20 Apr 2023 09:02 IST

అమీ జాక్సన్‌, నటి

నాలుగేళ్ల విరామం తర్వాత వెండితెరపై తిరిగి కనిపించబోతున్నా. ప్రసవం తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. అందరి తల్లుల్లానే నాక్కూడా నా కొడుకు ఆండ్రియానే మొదటి ప్రాధాన్యం. ఓ పక్క మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదిస్తూనే కెరియర్‌ ప్రణాళికలు వేసుకుంటున్నా. ఈ సంతోషం ప్రతి స్త్రీకీ దక్కాలి. మహిళలపై గౌరవం పెరగాలన్నా, సమాజంలో మార్పు రావాలన్నా.. మొదటి అడుగు మనదే అవ్వాలి. అందుకే, నావంతుగా గృహహింస బాధిత మహిళల కోసం పనిచేస్తున్నా. వీరికోసం పునరావాసకేంద్రాన్ని నడుపుతోన్న చెన్నైకి చెందిన ఓ సేవా సంస్థతో కలిసి పనిచేస్తున్నా. ఓ అమ్మగా పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో తెలుసు. కానీ, మంచి, చెడుల విచక్షణ నేర్పుతూ, ఆడవాళ్లను గౌరవించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనదే. బాల్యం నుంచే లింగవివక్ష చూపించకుండా పెంచగలిగితేనే పెద్దయ్యాక మహిళలను గౌరవిస్తారు. నా కొడుకుతో ఇప్పటి నుంచే వీటిపై మాట్లాడుతుంటా. భవిష్యత్తులో తను ప్రతి విషయాన్ని నాతో స్వేచ్ఛగా చెప్పుకొనేలా చేస్తా. తల్లీబిడ్డల అనుబంధంలో ప్రతీదీ చర్చించగలిగితేనే ఆ బంధం గట్టిపడుతుంది. ప్రస్తుతం ఓ చిత్రంలో కారాగారానికి కాపలాదారుగా ఉండే సంద్రాజేమ్స్‌ పాత్రకోసం మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ, రేసింగ్‌ వంటివీ నేర్చుకోవాల్సి వచ్చింది. ప్రసవం తర్వాత శారీరక శ్రమతో కూడిన ఈ పనులన్నీ చేయడం కొద్దిగా సవాలే అయినా... నన్ను నేను నిరూపించుకోవడానికి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. ఈ క్రమంలో నా పనుల్ని సమన్వయం చేసుకోవడానికి ఒక్కోసారి సూపర్‌వుమెన్‌గా మారుతుంటా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని