రాత్రి విధులా? జాగ్రత్త మరి..

మనలో కొందరు తప్పని పరిస్థితుల్లో రాత్రి విధులకు వెళ్లాల్సివస్తుంది. అలాంటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు, మనుషుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...

Published : 21 Apr 2023 01:09 IST

మనలో కొందరు తప్పని పరిస్థితుల్లో రాత్రి విధులకు వెళ్లాల్సివస్తుంది. అలాంటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు, మనుషుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...

చెక్‌ చేయండి.. ఆఫీసులో వాచ్‌మెన్‌లు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారా లేరా అనేది పరిశీలించాలి. సీసీటీవీల నిర్వహణ విషయంపైనా దృష్టి పెట్టాలి. అవి ఉన్నా పని చేయనివైతే లాభం లేదు కదా. ఆఫీసులో అత్యవసర అలారం తప్పకుండా ఉండాలి. ఈ అంశాలపై అధికారులతో చర్చించి తగిన జాగ్రత్తలు తీసుకునే వరకూ పోరాడుతూనే ఉండాలి. బయటకి వెళ్లేందుకు ముందే ఫోన్లో భద్రతా యాప్‌లను ఆన్‌లో పెట్టుకొని వెళితే సరి. సమయానికి ఒక బటన్‌ నొక్కగానే దగ్గర్లోని పోలీసులకు సమాచారం అందిస్తుంది.

రవాణా.. సంస్థ నుంచే వాహనం వస్తే పేచీ లేదు. వాళ్లు వెరిఫికేషన్‌ చేసి ఉంటారు కనుక భద్రత ఉంటుంది. ప్రైవేట్‌ వాహనం అయితే మనమే అప్రమత్తంగా ఉండాలి. బండి నెంబరు, డ్రైవర్‌ ఐడీ వంటివి తప్పని సరిగా తెలుసుకోవాలి. పెప్పర్‌ స్ప్రే, చిన్న క్లోజ్డ్‌ నైఫ్‌ వంటి వస్తువులను మీ బ్యాగులో తప్పకుండా పెట్టుకోవాలి. ప్రయాణంలో ఆపద ముంచుకొస్తే ఏం చేయాలన్నది ముందే ఆలోచించి జాగ్రత్తగా ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో ఆ ప్రణాళికను అమలు చేయొచ్చు.

చెప్పేయండి.. రాత్రివేళ విధులు సౌకర్యంగా అనిపించకపోయినా.. భద్రత లేదనిపించినా అధికారులతో పని వేళలు మార్చమని అడగండి. మీ భయాలను వారితో చర్చిస్తే మార్చే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్