త్యాగాలు చేయక్కర్లేదు...

మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నా... ఇంటి పనులు పూర్తిగా మనవే అని భావించే మహిళలే ఎక్కువ. మా ఇంట్లోనూ దీన్ని చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. అమ్మానాన్నలకు సొంత ఆసుపత్రి ఉంది.

Updated : 22 Apr 2023 06:14 IST

రాధిక ఆప్టే, నటి

గవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నా... ఇంటి పనులు పూర్తిగా మనవే అని భావించే మహిళలే ఎక్కువ. మా ఇంట్లోనూ దీన్ని చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. అమ్మానాన్నలకు సొంత ఆసుపత్రి ఉంది. మత్తుమందు నిపుణురాలైన అమ్మ దానికి సీఈవో కూడా. నాన్న నరాల శస్త్రచికిత్స నిపుణుడు, ఛైర్మన్‌. నాన్నతో సమానంగా పనిచేసినా, ఇంటికొచ్చేసరికి అమ్మ ఇల్లాలిగా మారిపోయేది. వంట దగ్గర్నుంచి ఇంటి పనులన్నీ తనే చూసుకొనేది. నాన్న నుంచి ఏ సాయమూ ఉండేది కాదు. పంచుకునే వీలున్నా కొన్ని బాధ్యతలను అప్పగించడానికి ఆడవాళ్లు సంకోచిస్తూనే ఉంటారు. సమానత్వభావన ప్రకటించడానికి భయపడతారు. అలా పంచడం తప్పని ఆడపిల్లలకు బాల్యం నుంచే నేర్పించడం ఇందుకు కారణం. అమ్మాయిలు కూడా నానమ్మ, అమ్మమ్మ, తల్లిని చూసి పెరుగుతూ.. పెద్దయ్యాక ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇంట్లో పనిని అందరూ పంచుకుంటే ఒకరిపైనే భారం ఉండదు. మహిళలే వంటచేయాలని కూర్చోక మగవాళ్లూ తగిన సాయం చేయాలి. పనులకు లింగభేదం ఉండకూడదు. అప్పుడే ఆడవాళ్లు వ్యక్తిగత జీవితాన్ని కోల్పోరు. స్వీయ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి వ్యక్తి అనిపించుకోవడానికి త్యాగాలు చేయాల్సిన అవసరమూ లేదు. అలాగే ఈమధ్య ప్లాస్టిక్‌ సర్జరీల ప్రాధాన్యం పెరిగింది. వీరంతా నాకు ఒకేలా, వింతగా కనిపిస్తారు. ఎవరికో అందంగా కనిపించాలని సహజత్వానికి దూరం కావొద్దు. ఎవరి ప్రత్యేకత వారిదే. వాళ్లు వాళ్లలా ఉండటమే అసలైన అందమని నా అభిప్రాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని