ఆలోచించి... మాట్లాడండి

చదువు ఒక ఎత్తు.. ఉద్యోగం మరొకెత్తు. ప్రతి చోటా హడావిడిగా, కలివిడిగా మాట్లాడినా.. ఇంటర్వ్యూ అంటే మాత్రం కొంత భయం ఉంటుంది.

Published : 23 Apr 2023 00:28 IST

చదువు ఒక ఎత్తు.. ఉద్యోగం మరొకెత్తు. ప్రతి చోటా హడావిడిగా, కలివిడిగా మాట్లాడినా.. ఇంటర్వ్యూ అంటే మాత్రం కొంత భయం ఉంటుంది. అయినా పర్లేదు... మీ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకొని ఇంటర్వ్యూల్లో విజయం ఎలా సాధించాలో చదివేయండి మరి..

* ముందుగా మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. చేయగలనా లేదా అనే సందిగ్ధత వద్దు. చేయగలనని పూర్తిగా నమ్మకం వచ్చాకే ముందడుగేయండి. మనపై మనకు నమ్మకం ఉంటే ఎంత కష్టమైన పనినైనా సాధించగలమని గుర్తుంచుకోండి.

* మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచిన సంస్థ గురించి అధ్యయనం చేయండి. దాని పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోండి. ఆ సంస్థ ఉత్పత్తులు, నాణ్యత ఎలా ఉంటుంది. యజమానులు ఎవరు.. ఇలాంటి పలు అంశాలపై అవగాహన తెచ్చుకోండి. అప్పుడు అధికారులు సంస్థ గురించి ఏ ప్రశ్న అడిగినా ధైర్యంగా సమాధానమివ్వొచ్చు.

* ఎదుటి వారు మాట్లాడుతున్న అంశంపై మీకు ఇష్టం ఉండకపోవచ్చు. అది మీ ముఖంలో కనబడనివ్వకండి. వారు చెప్పేదేదైనా ఆసక్తిగా వినండి. విషయాన్ని శ్రద్ధగా వింటున్నట్టు మీ బాడీ లాంగ్వేజ్‌ ఉండాలి. అప్పుడే మీపై గౌరవం పెరుగుతుంది.

* అధికారులు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇవ్వండి. అనవసరంగా మాట్లాడొద్దు. ఇలా మాట్లాడితే ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆలోచించి నిదానంగా సమాధానం చెప్పండి. మీ సందేహాలన్నీ నివృత్తి చేసుకోండి. సంస్థ వైపు నుంచి మీకే ఇబ్బందీ ఉండదనిపించినప్పుడే ఉద్యోగంలో చేరండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్