కుటుంబం కోసమే..
దేశంలో 67శాతం మంది మహిళలు తమ కుటుంబాలకు ఆర్థికంగా దన్నుగా ఉండటం కోసమే ఉద్యోగాలు చేస్తున్నట్లు తేలింది. ఆర్థిక విషయాలపై ఉద్యోగినుల అవగాహనను గుర్తించడానికి చేపట్టిన ఈ అధ్యయనం ఇంకా ఏం చెప్పిందంటే....
దేశంలో 67శాతం మంది మహిళలు తమ కుటుంబాలకు ఆర్థికంగా దన్నుగా ఉండటం కోసమే ఉద్యోగాలు చేస్తున్నట్లు తేలింది. ఆర్థిక విషయాలపై ఉద్యోగినుల అవగాహనను గుర్తించడానికి చేపట్టిన ఈ అధ్యయనం ఇంకా ఏం చెప్పిందంటే....
మన దేశంలో టైర్ 1, టైర్ 2 మెట్రో నగరాల నుంచి సేకరించిన డేటా ప్రకారం ఉద్యోగినులు తమ సంపాదనను ఇంటి బడ్జెట్‌కు ఎక్కువశాతం కేటాయిస్తున్నారు. కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసమే 67 శాతం మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మొత్తం 10వేల మంది ఉద్యోగినుల నుంచి సమాచారాన్ని సేకరించారు. దిల్లీలో 70 శాతం మంది ఉద్యోగినులు ఆదాయాన్ని కుటుంబాలకే అందిస్తున్నట్లు చెప్పారు. మిగతా వాళ్లు సగం కుటుంబ ఖర్చులకిచ్చి మిగతాది పొదుపు చేస్తున్నట్లు తెలిసింది. వీరంతా కుటుంబ ఖర్చులు, ఆర్థిక సంబంధిత విషయాల్లోనూ ఎక్కువగా పాలు పంచుకుంటామని చెప్పారు. ఆర్థిక విషయాల్లో అవగాహన పెంచుకుంటున్నారు. 21-65 వయసులోపు గృహిణులు, వ్యాపార వేత్తలపైనా అధ్యయనం చేశారు. వీరిలో మూడోవంతు కనీసం ఇంటి ఆర్థిక వ్యవహారాల్లో పాల్గొనడానికి కూడా వెనుకాడుతున్నారు. వ్యాపారవేత్తలు తమ వ్యక్తిగత ఆర్థికభద్రతపై అవగాహన పెంచుకోవడంలో ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో సగం సామాజిక మాధ్యమాలను అనుసరిస్తూ ఆర్థిక అవగాహనను పెంపొందించుకోవడానికి సదస్సులకు హాజరు కావడం, నిపుణుల సలహాల కోసం ముందడుగు వేస్తున్నట్లు తెలిసింది. అమెరికాలో ఇదే విషయంపై చేపట్టిన సర్వే ఫలితాలు కూడా దాదాపు మన దేశంలో వచ్చిన ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. గతంలో కూతురి సంపాదనను తీసుకోవడానికి వెనుకడుగు వేసేవారు. ఉద్యోగమంటే పురుషుడి బాధ్యత అనేవారు. ఆ పరిస్థితి మారింది. ఉద్యోగానికి లింగ భేదం లేదు. స్త్రీపురుషులిద్దరూ అన్ని రంగాల్లోనూ సమానంగా అడుగుపెట్టి కుటుంబ ఆర్థిక బాధ్యతలనూ పంచుకోవడం ప్రత్యేకంగా కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.