వ్యాపారం చిన్నదైతేనేం..?

పిల్లలు, కుటుంబం కోసం కెరియర్‌ని పక్కన పెడుతున్న వారెందరో! అలాగని ‘గృహిణిగానే మిగిలిపోవాలి’ అని చాలామంది అనుకోవడం లేదిప్పుడు. ఇంటి నుంచే వ్యాపారాలు చేస్తున్నారు.

Published : 04 May 2023 00:13 IST

పిల్లలు, కుటుంబం కోసం కెరియర్‌ని పక్కన పెడుతున్న వారెందరో! అలాగని ‘గృహిణిగానే మిగిలిపోవాలి’ అని చాలామంది అనుకోవడం లేదిప్పుడు. ఇంటి నుంచే వ్యాపారాలు చేస్తున్నారు. ఆలోచన మంచిదే... తడబడకుండా ముందడుగు వేయాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

* ముందు కొద్దిపాటి పెట్టుబడితో ‘ప్రయత్నిద్దా’మన్న ధోరణే చాలామందిది. దీంతో తక్కువ ధరకే వస్తువులు ఎక్కడ దొరుకుతాయా అని పరిశీలిస్తుంటారు. ఇలాంటప్పుడు నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. ఖరీదు చేసేముందే అన్నింటినీ చెక్‌ చేసుకున్నాకే అమ్మకానికి తీసుకురావాలి. అప్పుడే వినియోగదారులకు మీపై నమ్మకం ఏర్పడుతుంది.

* కొనడం- అమ్మడం మాత్రమే నా పని అనుకోవద్దు. వినియోగదారులతో సత్సంబంధాలూ నెరపాలి. వస్తువు సమయానికి చేరిందా, నాణ్యత ఎలాగుందన్నవి ఆరా తీయాలి. వాళ్లేదైనా అసంతృప్తి వెలిబుచ్చినా, కోపం ప్రదర్శించినా సంయమనం పాటించాలి. సరైన పరిష్కారం చూపించగలగాలి అంటే... పెద్ద సంస్థల ‘కాల్‌సెంటర్‌’ తరహా సేవలు అందించగలగాలి. అప్పుడే వాళ్లకి మీపై విశ్వాసం ఏర్పడుతుంది. భవిష్యత్తులోనూ తిరిగి మీ వద్దకు రావడానికి ఆసక్తి చూపుతారు.

* నష్టాలను ఎవరూ ఇష్టపడరు. కానీ ప్రారంభంలో అవి పలకరించడం సహజమే. అలాగని డీలా పడొద్దు. ఒక్కోసారి సమయమంతా వ్యాపారానికే కేటాయిస్తున్నట్లు అనిపిస్తుంది. సమయ నిర్వహణకు దారులు వెతకాలే తప్ప నెగెటివ్‌ ఆలోచనలు రానీయొద్దు. ఓపికతో ఉంటేనే ముందుకు సాగగలం.

* ఎంతసేపూ మీ పనులతోనే బిజీగా గడిపేయొద్దు. మీ పోటీదారులు ఎవరు? వాళ్లు అనుసరించే పద్ధతులనూ గమనించాలి. ‘ఇంట్లో చేసే వ్యాపారానికి పోటీ ఏంటి?’ అన్న ఆలోచన వద్దు. మీ తరహాలో వ్యాపారం చేసే వాళ్లు ఎలా ఆకట్టుకుంటున్నారు? ఏవిధంగా సాగుతున్నారన్నది పరిశీలించాలి. వాళ్లను అనుసరించాలనేం లేదు. కానీ ఈ తరహా పరిశోధన కొత్త ఆలోచనలనిస్తుంది. అదీ మీ వ్యాపారానికి అనుకూలమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్