పనుల జాబితా రాస్తోంటే...
ఎంత ఉత్సాహంగా ఆఫీసులో అడుగుపెట్టినా.. పనుల హడావుడిలో కొన్నింటిని మర్చిపోతుంటాం. దీన్నుంచి బయటపడాలనే ‘టూ డూ లిస్ట్’ రాసుకుంటారు చాలామంది. తీరా అవి పూర్తవకపోతే ఒత్తిడికి లోనవుతున్నారట.
ఎంత ఉత్సాహంగా ఆఫీసులో అడుగుపెట్టినా.. పనుల హడావుడిలో కొన్నింటిని మర్చిపోతుంటాం. దీన్నుంచి బయటపడాలనే ‘టూ డూ లిస్ట్’ రాసుకుంటారు చాలామంది. తీరా అవి పూర్తవకపోతే ఒత్తిడికి లోనవుతున్నారట. దీన్నుంచి బయటపడాలా.. నిపుణుల సూచనలివిగో!
* జాబితాలో ఒక్కోటి పూర్తిచేసుకుంటూ వస్తే తెలియకుండానే మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. అయితే పది జాబితాగా రాసి, దానిలో తొమ్మిది పూర్తిచేసి ఒకటి మిగిలినా తెలియకుండానే ఒత్తిడీ ఏర్పడుతోందట. అది నెమ్మదిగా అసంతృప్తిగా మారుతోందని చెబుతోంది ఓ అధ్యయనం. అందుకే, ఎక్కడ మర్చిపోతామో అని గుర్తొచ్చినవన్నీ రాసినా...ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తే దీన్ని అధి గమించొచ్చు.
* టూ డూ లిస్ట్ రాసేటప్పుడే ఎప్పటిలోగా పూర్తిచేయాలి? ఈరోజు ఎంతవరకూ పూర్తిచేయొచ్చు అన్నదీ పక్కన చేర్చండి. అనవసర ఒత్తిడి తగ్గుతుంది. చేయాల్సిన పనిపై స్పష్టతా ఉంటుంది.
* చాలాసార్లు ‘ఎవరేమనుకుంటారో’ అన్న సందిగ్ధమే ఆందోళన పెంచుతుంది. అందుకే ఏం సమాధానం చెప్పాలా అని హైరానా పడిపోతుంటాం. జాబితాలో పూర్తవని పని పక్కన ‘ఎందుకు’ అనే కాలమ్‌నీ చేర్చండి. ‘అదనంగా వచ్చిన పని’, ‘మీటింగ్ పొడిగింపు’, ‘అనారోగ్యం’ ఇలా.. కారణమేంటో కాస్త వివరంగా రాయండి. ప్రయత్నించినా చేయలేకపోవడం మెదడుపై భారాన్ని తగ్గిస్తుంది. దాన్ని తిరిగి ఎలా ప్లాన్ చేసుకోవాలన్న స్పష్టత వస్తుంది. ఆలస్యం మీవల్ల అయితే ఏం చేయాలో ఆలోచించుకోండి. పక్కన వాళ్ల వల్లయితే వారితో చర్చించే మార్గాలను అన్వేషించొచ్చు. ఈసారి నుంచి వీటిని మీ జాబితాకి చేర్చుకోవడం మర్చిపోకండి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.