వేగంగా నైపుణ్యాలు పెంచుకోవాలా...

ఏ వృత్తిలో అయినా సరే మనం నిలదొక్కుకోవాలంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే.  వాటిని అందిపుచ్చుకోవాలంటే ఈ సూత్రాలను పాటించేయండి..

Published : 01 Jun 2023 00:19 IST

ఏ వృత్తిలో అయినా సరే మనం నిలదొక్కుకోవాలంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే.  వాటిని అందిపుచ్చుకోవాలంటే ఈ సూత్రాలను పాటించేయండి..

మల్టీటాస్కింగ్‌ వద్దు.. ఒకే సమయంలో రెండు మూడు పనులు చేయటం వల్ల దేనిపై నా ఏకాగ్రత నిలపలేరు. తద్వారా పనిలో ఉత్పాదకత తగ్గుతుంది. కావాల్సిన సమాచారం వెంటనే గుర్తురాక ఇబ్బంది పడతాం. అందుకే ఒకే పనిపై పూర్తి శ్రద్ధ పెట్టాలి.

నిపుణుల సలహా.. మనం నేర్చుకోవాలనుకుంటున్న నైపుణ్యాలపై నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.

విరామమూ ముఖ్యమే.. ఎంతసేపు పని చేశామనే దానికన్నా ఎంత ఉత్పాదకత అందించామన్నదే ముఖ్యం. అందుకోసం పని మధ్యలో కొంత విరామం తీసుకోవాలి. కాసేపు ఇష్టమైన సంగీతం వినొచ్చు. కాసేపు అలా నడకకూ వెళ్లొచ్చు. దీంతో మెదడుకు కాసేపు విశ్రాంతి దొరికి మరింత ఉల్లాసంగా పనిచేస్తాం.

పునశ్చరణతో.. నేర్చుకున్న విషయాలు పదేపదే నెమరు వేసుకుంటుంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఎన్నిసార్లు పునశ్చరణ చేసుకుంటే మెదడులో అంత బలంగా విషయాలు నాటుకుంటాయి. అంతేకాకుండా గతంలో పొందిన నైపుణ్యాలను ఇప్పుడు నేర్చుకునే విషయాలతో అనుసంధానం చేసుకొంటే మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్