పొరపాటు జరిగిందా..

పని పూర్తి అయ్యిందని తీరిగ్గా కూర్చున్నప్పుడో.. మీటింగ్‌ పూర్తయ్యాకో.. ఒక్కసారిగా గుర్తొస్తుంది.. పొరపాటు జరిగిందని. తెలిస్తే ఏమవుతుందోనన్న కంగారు అమ్మాయిల్లో సహజమే. బయటకు చెప్పడానికీ మొహమాటమో, భయమో అడ్డొస్తుంది.

Published : 03 Jun 2023 00:06 IST

పని పూర్తి అయ్యిందని తీరిగ్గా కూర్చున్నప్పుడో.. మీటింగ్‌ పూర్తయ్యాకో.. ఒక్కసారిగా గుర్తొస్తుంది.. పొరపాటు జరిగిందని. తెలిస్తే ఏమవుతుందోనన్న కంగారు అమ్మాయిల్లో సహజమే. బయటకు చెప్పడానికీ మొహమాటమో, భయమో అడ్డొస్తుంది. అలాగని మిన్నకుండి పోతున్నారా? అదే వద్దంటున్నారు నిపుణులు.

* ఏమంటారో.. కోప్పడతారేమో.. అన్న సందేహమే తప్పుని దాచేలా చేస్తాయి. చిన్నదైతే పర్లేదు.. అదే తెలియక పెద్దదానికి దారి తీస్తే? అయినా కోపగించు కుంటారనేముంది? ఒకవేళ ఆ క్షణం కోపగించుకున్నా అది మీ నిజాయతీనే చూపిస్తుంది. కాబట్టి.. ముందు పొరపాటుకి కారణాలేంటో ఆలోచించండి. తర్వాత పైవాళ్ల దృష్టికి తీసుకెళ్లండి. మీవల్లే తప్పు జరిగితే ఏం చేయాలో కనుక్కోండి. మిగతా ఎవరైనా కారణమైతే వాళ్లనూ సంప్రదిస్తే సరి. వీలైతే మార్పులు చేయొచ్చు.. పర్లేదనిపిస్తే వదిలేయొచ్చు. ఏదేమైనా మనసు మీద భారం తప్పుతుంది.

* పొరపాటు జరిగిందనగానే చాలామంది భయంతో బిగుసుకు పోతారు. తేరుకొనే సరికి జరగాల్సిన నష్టం జరుగుతుంది. మిమ్మల్ని, మీ పనితీరును అర్థం చేసుకునే వారెవరు? ఆఫీసులో స్నేహితులు, బాస్‌, మెంటార్‌.. ఇలా మీకు అండగా ఉండే వ్యక్తికి విషయం చెప్పండి. దేన్నీ దాయొద్దు. అలాగే వాళ్ల నుంచి ఆశిస్తున్న సాయమేంటో కూడా ఎలా ఎప్పుడు కావాలో కూడా చెప్పండి. కొన్నిసార్లు కేవలం మన మాటే సరిపోదు అన్నప్పుడు సాయంగా ఎవరోకరు అవసరమవుతారు. మరి అలాంటి స్నేహితులు/ సాయం ఆఫీసులో మీకుందా అన్నదీ చూసుకోవాలి.

* పొరపాటు అయ్యిందని ఒప్పుకొంటే.. ప్రాజెక్టు నుంచి పక్కకు వచ్చేయాలి. లేదూ మళ్లీ ముఖ్యమైన పనుల్ని అప్పగించరు.. చాలామంది ఆలోచన ఇదే! ఇప్పటిదాకా చేసిన పనులు ఏమయ్యాయ్‌? ఇంట్లోనో.. స్నేహితుల దగ్గరో.. ‘నేనిలా చేశా తెలుసా?’, ‘మా బాస్‌ ఇలా మెచ్చుకున్నారు’ అంటూ ఏదో ఒక సందర్భంలో చెప్పి మురిసిపోయి ఉంటాంగా! అదే ఇప్పుడు చేయండి. గతంలో చేసినవి చెప్పి ‘మరో ఛాన్స్‌’ అడగండి. వాటికి మీ ప్రణాళికలూ జోడిస్తే.. అవకాశం ఇవ్వక ఎందుకుంటారు? ఆత్మవిశ్వాసం చూపండి.. తప్పిదాన్నీ అవకాశంగా మార్చుకోవచ్చు. అయితే.. దానిలో ఇతరులను ఇరికించాలన్న తపన మాత్రం మంచిది కాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్