ధ్యానంతోనే ధైర్యం

ఇల్లు, ఆఫీసు పని ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకునే క్రమంలో మనం నిత్యం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాం.. అయితే చాలా సందర్భాల్లో ఇది సాధారణమే అనుకొని తేలిగ్గా తీసుకుంటాం.

Published : 12 Jun 2023 00:22 IST

ఇల్లు, ఆఫీసు పని ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకునే క్రమంలో మనం నిత్యం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాం.. అయితే చాలా సందర్భాల్లో ఇది సాధారణమే అనుకొని తేలిగ్గా తీసుకుంటాం. కానీ, అది కుంగుబాటుకి దారి తీయొచ్చు అంటారు నిపుణులు.. దానికి కారణాలు, పరిష్కారాలు...

తరచూ శ్వాస తీసుకోవడం.. తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు శరీరం హెచ్చరికలు చేస్తుంది. దీన్ని ఫైట్‌ లేదా ఫ్లైట్‌ రెస్పాన్స్‌ అంటారు. ఈ పరిస్థితిలో ఊపిరితిత్తులు శరీరానికి ప్రమాదం జరగనుందనే సూచనగా అధిక ఆక్సిజన్‌ను అందిస్తాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది.

టెన్షన్‌ పడటం.. ఆందోళనకు శరీరం బిగుసుకుంటుంది. క్రమేణా ఒళ్లు నొప్పులు, తలనొప్పి, మైగ్రెయిన్‌ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ప్యానిక్‌ అటాక్‌ .. గుండె వేగంగా కొట్టుకోవడం, విపరీతమైన చెమటలు పట్టడం వంటివి దీని సూచనలు. వీటితో పాటు శరీర భాగాల్లో చలనం లేకపోవటం, ఛాతిలో నొప్పి, తల తిరగడం, ఎక్కువ వేడిగా, చలిగా అనిపించడం వంటివన్నీ పానిక్‌ లక్షణాలే.

అజీర్తి... ఆందోళనగా ఉన్నప్పుడు శరీరం అడ్రినలిన్‌, కార్టిసాల్‌ అనే హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గుండె కొట్టుకునే వేగాన్ని, శ్వాసక్రియ రేటుని నియంత్రిస్తాయి.

పరిష్కార మార్గాలు...

చురుగ్గా ఉండటం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది శారీరకంగానే కాక మానసికంగానూ ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. జీవక్రియా రేటుని మెరుగు పరిచి ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.

ధ్యానం... రోజూ అరగంట ధ్యానం చేయటం వల్ల ఆందోళన లక్షణాలు తగ్గి, యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది.

కాఫీ తగ్గించడం... ఒకవేళ కాఫీలు ఎక్కువ తాగుతూ ఉంటే తగ్గించాలి. అందులోని కెఫీన్‌ ఆందోళనను మరింత పెంచుతుంది. దాని బదులు మంచినీళ్లను తీసుకోండి. అవి మన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.

సరిపడా నిద్ర... కంటినిండా నిద్ర మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. అది కూడా రాత్రి నిద్రే మంచిది. పడుకునే ముందు ఫోన్లు వాడటం సరికాదు. మనం నిద్ర పోయే గది మరీ వేడిగానూ, చల్లగానూ లేకుండా చూసుకోవాలి. రోజూ ఒకే సమయానికి పడుకునే అలవాటు చేసుకుంటే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్