మీ కోసం మీరు...

మనలో సాధారణంగా మల్టీటాస్కింగ్‌ చేసే వారే ఎక్కువ. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం.. ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకోవాలని అనుకుంటాం. అందులో తప్పులేదు కానీ నేనే బాగా చేయగలమని కొందరు అన్ని పనులూ మీదేసుకుంటారు. ఒకవేళ అలా చేయలేకపోతే గిల్టీగా భావిస్తుంటారు.

Published : 22 Jun 2023 02:14 IST

మనలో సాధారణంగా మల్టీటాస్కింగ్‌ చేసే వారే ఎక్కువ. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం.. ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకోవాలని అనుకుంటాం. అందులో తప్పులేదు కానీ నేనే బాగా చేయగలమని కొందరు అన్ని పనులూ మీదేసుకుంటారు. ఒకవేళ అలా చేయలేకపోతే గిల్టీగా భావిస్తుంటారు. ఫలితమే ఒత్తిడి, ఆందోళన, ఉత్పాదకత తగ్గడం వగైరా. కాబట్టి..

బాధ్యతలు పంచండి... మిమ్మల్ని మీరు ఇతరుల ముందు నిరూపించుకోవాలన్న తపన వద్దు. అన్నీ మీరే చేయక కుటుంబ సభ్యులకూ బాధ్యతలు పంచండి. భర్త, పిల్లలకి సంబంధించిన పనులను వారంతట వారే చేసుకునేలా అలవాటు చేయండి. ఇంటి పనుల్లోనూ సహాయం చేయనివ్వండి.

మన కోసం కొంత సమయం... ఎంత తీరిక లేకుండా ఉన్నా సరే మీ కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు అప్పుడప్పుడూ అలా స్నేహితులతో కలిసి కాఫీకెళ్లటం, వారాంతాల్లో వారితో సమయం గడపటం వంటివి చేయాలి. సంగీతం, డాన్స్‌, ఆటలు, కళలు ఇలా ఏదో ఒకటి వ్యాపకంలా పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల  ఒకే లాంటి ఆసక్తులు ఉన్న వాళ్లతో స్నేహాలు ఏర్పడతాయి.

పోల్చుకోవద్దు... ఏ విషయంలోనూ ఇతరులతో పోల్చుకోవద్దు. అది అనవసర ఆందోళనలకు కారణమవుతుంది. ప్రతిదీ బాగా ఉండాలనీ అనుకోవద్దు. అది ఒక అపోహ మాత్రమే. ఎంత త్వరగా అలాంటి భావనల నుంచి బయట పడతారో అంత సంతోషంగా ఉండగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని