ప్రతి ఎంపికా నాదవ్వాలనుకున్నా...

పద్నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచే నటించడం ప్రారంభించా. మొదట్లో ప్రకటనల్లో పనిచేసేదాన్ని. నిజానికి కాలేజీ చదువు పూర్తయ్యేవరకూ దీన్నే కెరియర్‌గా కొనసాగిస్తానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. నటినైన కొత్తల్లో... హీరోయిన్‌గా నేనెలాంటి పనులు చేయాలనే కనీస అవగాహన కూడా లేదు.

Published : 29 Jun 2023 00:35 IST

- రెజీనా కసాండ్రా, నటి

ద్నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచే నటించడం ప్రారంభించా. మొదట్లో ప్రకటనల్లో పనిచేసేదాన్ని. నిజానికి కాలేజీ చదువు పూర్తయ్యేవరకూ దీన్నే కెరియర్‌గా కొనసాగిస్తానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. నటినైన కొత్తల్లో... హీరోయిన్‌గా నేనెలాంటి పనులు చేయాలనే కనీస అవగాహన కూడా లేదు. కేవలం నటిస్తేనే నా పని పూర్తవదనీ, డబ్బింగ్‌ చెప్పాలి,  ప్రమోషన్లలో పాల్గొనాలి, ఎంతో మందిని కలవాలి...అనే విషయాలన్నీ అప్పుడే తెలుసుకున్నా. జీవితం కూడా అంతే! అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ, ఎప్పటికప్పుడు పరిణామం చెందుతూ కొత్త విషయాలెన్నో తెలుసుకోవాలి. నటినైన కొత్తల్లో చాలామంది ‘హీరోయిన్లకు కెరియర్‌ వ్యవధి తక్కువ. మహా అయితే, ఐదారేళ్లే. నువ్వు నీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకో’ అని సలహాలు ఇచ్చేవారు. నేనేమీ గడువు తేదీ ఉన్న పాలప్యాకెట్‌ని కాదు కదా! నిర్దిష్ట సమయం తర్వాత విసిరి పారేయడానికి. ఆ మాటలు విన్న క్షణమే అనుకున్నా. నా కెరియర్‌ని నేనే నిర్ణయించుకోవాలి. ప్రతి ఎంపికా నాదై ఉండాలి అని. ఇది జరిగి పదేళ్లు అవుతోంది. ఇప్పటికీ నేను ఇండస్ట్రీలో ఉన్నా. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా సంతృప్తిగానే ఉన్నా. అందరికీ నేను చెప్పేది ఒకటే... ‘ఓ వ్యక్తి ఎదగాలంటే వారి కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వెళ్లాలి. నేను అలా వెళ్లాకే... వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయి. మనం చేసే ప్రతి పని వెనుక ఎవరో ఉండి ప్రోత్సహిస్తారనీ, ప్రోత్సహించాలనీ భావించొద్దు. సరైన ప్రణాళిక, పని-జీవనశైలినీ సమతుల్యం చేసుకోవడం వస్తే చాలు విజయం మన వెన్నంటే ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని