భయపడితే ఎలా?

మనలో కొందరు చిన్న నిర్ణయం తీసుకోవడానికీ తడబడుతుంటారు. ఈ తీరే మంచిది కాదు. కఠిన పరిస్థితుల్లోనూ సానుకూల నిర్ణయాలు తీసుకునే తత్వం అలవరచుకుంటేనే నిలదొక్కుకోవడం సాధ్యం. అందుకు సాయపడే అంశాలను నిపుణులు సూచిస్తున్నారిలా..

Published : 04 Jul 2023 00:30 IST

మనలో కొందరు చిన్న నిర్ణయం తీసుకోవడానికీ తడబడుతుంటారు. ఈ తీరే మంచిది కాదు. కఠిన పరిస్థితుల్లోనూ సానుకూల నిర్ణయాలు తీసుకునే తత్వం అలవరచుకుంటేనే నిలదొక్కుకోవడం సాధ్యం. అందుకు సాయపడే అంశాలను నిపుణులు సూచిస్తున్నారిలా..

ఒత్తిడికి గురికావొద్దు... కఠినమైన పరిస్థితుల్లో ఆతృత, ఆందోళన మామూలే. తొందరపడో, ఆలోచించకుండానో, ఒత్తిడితోనో నిర్ణయాలు తీసుకుంటే వాటి పర్యవసానాలు మరిన్ని సమస్యలను తెచ్చిపెడతాయి. వీటన్నిటికీ అతీతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని కష్టనష్టాలను బేరీజు వేసుకుని మీ అభిప్రాయం చెప్పండి.

సమయం తీసుకోండి... ఇష్టమైనా, కష్టమైనా నిర్ణయం చెప్పడానికి ముందు సమయం తీసుకోండి. దీర్ఘకాలిక లాభనష్టాలను ఆలోచించండి. ప్రస్తుతాన్ని చూసి భయపడి మంచి అవకాశాలను వదులుకోవద్దు.

లక్ష్యాలు, విలువలు... కొన్ని నిర్ణయాలు మన లక్ష్యాల్ని, విలువల్ని దెబ్బతీసేలా ఉంటాయి. అలాంటి వాటికి వీలైనంత వరకు నో చెప్పడానికే ప్రయత్నించండి. ఒత్తిడితోనో, ఎవరో చెప్పారనో మీరు వేసే ఒక్క అడుగు, మీ వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్ని తారుమారు చేస్తుందని మరచిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని