రూపాయి కూడా దాచుకోలేదు..

పదేళ్ల ఉద్యోగానుభవం. ఇంతవరకూ రూపాయి కూడా దాచుకోలేదు. వచ్చిన జీతమంతా ఇంటికీ, పిల్లలకే ఖర్చు అవుతోంది. భవిష్యత్తులో అనుకోని అవసరమొచ్చినా తడుముకోవాల్సిన పరిస్థితి. కొద్దిమొత్తమైనా దాద్దామంటే ఎలా ప్లాన్‌ చేసుకోవాలో తెలీట్లేదు.

Updated : 05 Jul 2023 12:31 IST

పదేళ్ల ఉద్యోగానుభవం. ఇంతవరకూ రూపాయి కూడా దాచుకోలేదు. వచ్చిన జీతమంతా ఇంటికీ, పిల్లలకే ఖర్చు అవుతోంది. భవిష్యత్తులో అనుకోని అవసరమొచ్చినా తడుముకోవాల్సిన పరిస్థితి. కొద్దిమొత్తమైనా దాద్దామంటే ఎలా ప్లాన్‌ చేసుకోవాలో తెలీట్లేదు. ఇలా ఆలోచించడం సబబేనా? అయితే ఎలా ప్రణాళిక వేసుకోవాలి?

- ప్రశాంతి, ఖమ్మం

చాలామంది ఉద్యోగినులు డబ్బు వ్యవహారాలకు దూరమే. అకౌంటింగ్‌ విభాగానికి సీనియర్‌ మేనేజర్‌ స్థాయిలో ఉండీ తమ నగదు నిర్వహణ, సేవింగ్స్‌ విషయానికి వచ్చేసరికి వెనకడుగు వేసేవారున్నారు. ఇంకా నయం.. మీరు ఇప్పటికైనా కళ్లు తెరిచారు. చాలామంది మహిళలు పదోన్నతి వరకూ గ్రహించలేరు.  ఖర్చు చేసేప్పుడు ఆచితూచి అడుగేయండి. ఇది మనకు సహజంగానే వస్తుంది. పొదుపు, మదుపులపై పెద్దగా దృష్టిపెట్టక పోవడానికి దానిపైనున్న అనాసక్తే కారణం! దీనికి కొన్ని నైపుణ్యాలు, అవగాహన కావాలి. వాటిపై పట్టు తెచ్చుకోండి. ఇంకా జీవనశైలికి ఎంత ఖర్చుపెడుతున్నారో పరిశీలించుకోండి. ఖర్చుదేముంది.. పెట్టుకుంటూ పోతే ఎంతైనా పెట్టొచ్చు. కానీ ఆదాయానికి పరిమితి ఉంటుంది. దీన్ని గ్రహించి.. 50:30:20 పద్ధతిని అనుసరించండి. ఆదాయంలో అవసరాలకు 50, కావాలనిపించే వాటికి 30, పొదుపునకు 20% కేటాయించాలి. ఆపై.. అతిచిన్న (ఏడాదికంటే తక్కువ), చిన్న (1-3 ఏళ్లు), పెద్ద (మూడేళ్లకుపైగా) ఆర్థిక లక్ష్యాలను పెట్టుకోండి. వాటి ఆధారంగా పెట్టుబడి ప్రారంభించండి. ఒకేసారి పెద్దమొత్తాల్లో పెట్టాలన్న తొందరొద్దు. అలాగే ఒకేదానిలో డబ్బంతా పెట్టేయొద్దు. రిస్క్‌ ఉంటుంది. పదవీవిరమణ గురించీ ఆలోచించాలి. ఇంకా 6-8 నెలలు జీతం రాకపోయినా నెట్టుకొచ్చేలా కొంత మొత్తం పక్కన పెట్టండి. చివరగా ట్యాక్స్‌ గురించీ ముందునుంచీ పట్టించుకుంటే ఆఖర్లో ఇబ్బంది ఉండదు. వీటిని అనుసరిస్తూ వెళ్లండి. తర్వాత్తర్వాత మీకే అవగాహన వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని