ఇవి మర్చిపోవద్దు...
చిరుజల్లులు కురుస్తున్న వేళ.. వానలని ఆస్వాదించాలనుకొనేవాళ్లూ, అందమైన దృశ్యాలను చూడాలనుకొనేవాళ్లూ ఉండనే ఉంటారు. కుటుంబం, స్నేహితులతో బయటకు వెళ్లేటప్పుడు బ్యాగ్‌లో కొన్ని వస్తువులు ఉంచుకుంటే మీ ప్రయాణం సౌకర్యంగా మారుతుంది..
చిరుజల్లులు కురుస్తున్న వేళ.. వానలని ఆస్వాదించాలనుకొనేవాళ్లూ, అందమైన దృశ్యాలను చూడాలనుకొనేవాళ్లూ ఉండనే ఉంటారు. కుటుంబం, స్నేహితులతో బయటకు వెళ్లేటప్పుడు బ్యాగ్‌లో కొన్ని వస్తువులు ఉంచుకుంటే మీ ప్రయాణం సౌకర్యంగా మారుతుంది..
వాటర్‌ఫ్రూఫ్ బ్యాగ్: లగేజీని ప్యాక్ చేసే ముందు సాధారణ బ్యాగ్ బదులుగా వాటర్‌ఫ్రూఫ్ బ్యాగ్‌ని ఉపయోగించటం మంచిది. దీని వల్ల మీ మొబైల్, బట్టలు, ఆహారం ఇతర ఏ వస్తువులైనా పాడవ్వకుండా ఉంటాయి.
రెయిన్ కోట్: ఈ కాలంలో బయటకు వెళ్లే ముందు మొదట చేయవలసింది రెయిన్‌కోట్‌ను ప్యాక్ చేయడం. ఇది వర్షం నుంచి రక్షించటమే కాదు, అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది.
తేలికపాటి బట్టలు: విహారయాత్రకు ఎంచుకొనే దుస్తులు తేలికపాటి లేదా సింథటిక్‌వి అయితే మేలు. ఒకవేళ తడిచినా త్వరగా ఆరిపోతాయి. వీలైనంత వరకూ వాటర్‌ఫ్రూఫ్ షూలను వాడాలి.
ఫస్ట్ ఎయిడ్ బాక్స్: ఈ కాలంలో పురుగులు, దోమలు, కీటకాలు ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికీ ప్రథమ చికిత్స పెట్టెను సిద్ధంగా ఉంచుకోవాలి.
కొన్ని వస్తువులు: పైన చెప్పిన జాగ్రత్తలతో పాటు హెయిర్ డ్రైయర్, పవర్ బ్యాంక్, వాటర్‌ఫ్రూఫ్ మొబైల్ కవర్, గొడుగు సర్దుకోవటం మర్చిపోవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.