విరామం తీసుకోవాల్సిందే!

ఇంటిపనీ, ఆఫీసుపనీ ఎంత సమర్థంగా నిర్వర్తిస్తున్నా... అప్పుడప్పుడు అలసట, అసహనం తప్పకపోవచ్చు. ఇందుకు ఈ పొరపాట్లు కారణం కావొచ్చు..

Published : 23 Jul 2023 00:16 IST

ఇంటిపనీ, ఆఫీసుపనీ ఎంత సమర్థంగా నిర్వర్తిస్తున్నా... అప్పుడప్పుడు అలసట, అసహనం తప్పకపోవచ్చు. ఇందుకు ఈ పొరపాట్లు కారణం కావొచ్చు..

ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక విశ్రాంతి పేరుతో సెల్‌ఫోన్లోనో, ఐపాడ్‌లోనో సినిమాలు చూసేందుకు ప్రాధాన్యం ఇస్తాం. ఆ ప్రభావం మన నిద్రపై పడుతుంది. మగత నిద్ర కాస్తా... మర్నాడు బడలికను తెచ్చేస్తుంది. దాంతో ఆ ప్రభావం పనిపైనా పడుతుంది. అందుకే నిద్రపోయేందుకు కనీసం గంట ముందు.. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లకు దూరంగా ఉండటం అలవాటుగా మార్చుకోవాలి.

కార్యాలయంలో పనిచేసే బల్లపై, రకరకాల కాగితాలూ, పెన్నులూ, తినే పదార్థాలు.. వంటివన్నీ పేర్చేస్తున్నారా? ఇవన్నీ తెలియకుండానే మానసిక శక్తిని హరించేస్తాయంటున్నాయి కొన్ని అధ్యయనాలు. కాస్త తీరిక చేసుకుని అన్నీ ఓ క్రమంలో పెట్టి చూడండి. చెత్తను తీసేయండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది.

ఈ రోజుల్లో కంప్యూటరుతోనే ఎక్కువ పనులు. మరి మీరు కూర్చున్న స్థలంలో వెలుతురు సరిగా ఉందో లేదో చూసుకున్నారా? తక్కువ వెలుగులో కూర్చుని పనిచేయడం, జిగేల్‌మనేంత వెలుతురు ఉంచుకోవడం రెండూ పొరపాటే.  వీటివల్ల నష్టాలు వెంటనే కనిపించకపోవచ్చు. కానీ.. కళ్లు త్వరగా అలసిపోతాయి. మీ సిస్టమ్‌ లైటింగ్‌ పరిశీలించుకోండి.

ఆఫీసుకు వెళ్లింది మొదలు.. గంటల తరబడి కూర్చుని పనిచేస్తుంటాం. దానివల్ల బరువు పెరగడం ఒక్కటే కాదు.. శక్తి కూడా తగ్గుతుంది. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా విరామం తీసుకోండి. లేదంటే ఈ ప్రభావం మెదడుపై పడి.. క్రమంగా ఒత్తిడి మొదలవుతుంది. అలసటా తప్పదు. ఐదు నిమిషాల విరామమైనా తీసుకుంటూ ఉంటే సాంత్వన దొరుకుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని