ప్రేమలో మోసపోయారా..!
మనసుకు దగ్గరైన, జీవిత భాగస్వామి కావాలనుకున్న వ్యక్తి మోసం చేస్తున్నట్లు గుర్తిస్తే ఆ వేదన బాధాకరం. ఇటువంటి సందర్భాన్నెలా ఎదుర్కోవాలో తెలుసా?
మనసుకు దగ్గరైన, జీవిత భాగస్వామి కావాలనుకున్న వ్యక్తి మోసం చేస్తున్నట్లు గుర్తిస్తే ఆ వేదన బాధాకరం. ఇటువంటి సందర్భాన్నెలా ఎదుర్కోవాలో తెలుసా?
మోసపోయామని తెలిసినప్పుడు ఆవేశానికి లోనుకాకూడదు. అధైర్య పడకుండా ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నించాలి.
నిజాన్ని... ఎదురుగా కనిపిస్తున్న వాస్తవాన్ని స్వీకరించగలగాలి. మొదట ఒత్తిడి అనిపించినా క్రమేపీ సర్దుకుంటారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. రోజులు, వారాల్లోపు ఆ భావన నుంచి బయటపడటానికి మీఅంతట మీరే ప్రయత్నించాలి. ఎదుటివ్యక్తిది నటన అని తెలుసుకున్నందుకు సంతోషించే స్థాయికి మనసును తెచ్చుకోగలగాలి. ఆ వ్యక్తి గురించి పదేపదే ఆలోచించడం, అతడిని కలుసుకోవడానికి ప్రయత్నించడం మానేయాలి. ఆ జ్ఞాపకాలకు దూరంగా ఉండటానికి మనసుకు వ్యాయామమివ్వాలి.
ఆ తర్వాతేంటి.. అప్పటివరకు కట్టుకున్న కలల మేడ కూలిపోయిందంటూ అక్కడే ఉండిపోకూడదు. రోలర్ కోస్టర్ లాంటి జీవితంలో ఇవన్నీ ఉంటాయనే ఆలోచన మనసును కొంత తేలిక చేస్తుంది. ఇప్పటివరకు జరిగిందాన్నే తలచుకొని కుమిలిపోకుండా తర్వాతేంటి అనే భావనకు రావాలి. ఇదొక కొత్త మలుపు అనుకొని మరొక మార్గాన్ని అన్వేషించాలి. జీవితాన్ని మరొకరి చేతుల్లో కాకుండా సొంతంగా ఈసారైనా ప్రణాళికగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాలి. మనసుకు నచ్చిన అభిరుచికి సమయాన్నివ్వాలి. మంచి సినిమా చూడ్డం, బొమ్మలు వేయడం మీ ఇష్టం. విహారం మనసును సాంత్వనపరుస్తుంది. ఇష్టమైన ప్రాంతం, పర్వతారోహణ వంటివన్నీ మనసుని శక్తివంతం చేస్తాయి. కుటుంబంతో కలిసి గడపాలి. నిపుణుల సలహాలు, సూచనలను పాటిస్తూ వ్యాయామంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే చాలు. శారీరక, మానసికారోగ్యం మెరుగుపడుతుంది. అప్పుడే మనసు కొత్త ఉత్సాహంతో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సాయపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.